త్యాగాల పునాదులపై ఏర్పడ్డ పార్టీ టీఆర్ఎస్

కరీంనగర్ : త్యాగాల పునాదులపై ఏర్పడ్డ టీఆర్ఎస్ అని.. అందుకే తెలంగాణ కోసం మాయమాటలు చెప్పిన టీడీపీ, కాంగ్రెస్ లను ప్రజలు చీకోట్టారని మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ లో తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో  ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పదవులు లెక్కకాదని.. అందుకే ఉద్యమం కోసం ఎన్నోసార్లు రాజీనామాలు చేశామన్నారు. అందుకే ప్రజలు ఉద్యమకారులకు పట్టం కట్టారన్నారు.

టీడీపీ, కాంగ్రెస్ లు ఉద్యమ ద్రోహలని, చంద్రబాబు బయటకు జై తెలంగాణ అని, లోపల నై తెలంగాణ అన్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ తుల ఉమ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కలెక్టర్ నీతూ ప్రసాద్ పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *