
తోహాస్ అక్రమాల మీద మంత్రి మహేందర్ రెడ్డి మరో మారు సమిక్ష
అక్రమాల మీద కేసుల పురోగతి ఏమైంది : మంత్రి మహేందర్ రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 6 : ట్రక్ ఆపరేటర్స్ హైవే ఎమినిటీస్ సొసైటీ ( తోహాస్) అక్రమాల మీద రవాణా శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మరో సారి ఉన్నతాధికారులతో సమిక్షంచారు. శుక్రవారం సచివాలయంలో గతవారంలో రాష్ట్ర లారీ ఓనర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుర్గాదాస్ లు మంత్రికి తోహాస్ అక్రమాల మీద చర్యలకు విన్నవించిన నేపధ్యంలో చర్యల పురోగతిమీద మంత్రి మరోసారి అధికారులతో సమిక్ష నిర్వహించారు. రవాణా శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ సునీల్ శర్మ, జేటీసీలు పాండురంగనాయక్, రమేష్,రంగారెడ్డి డీటీసీ ప్రవీణ్ రావులతో సమావేశమయ్యారు. పెద్దంబరం పేటలోని సర్వే నెంబర్ 244లో గతంలో తోహాస్ కు రవాణా శాఖ ప్రిన్స్ పుల్ సెక్రటరీ అధ్యక్షతన కేటాయించిన 9.37 ఎకరాల స్థలం ను ఆ సంఘం సెక్రటరీ జనరల్ మహమ్మద్ ఖాన్ నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాకు పాల్పుడుతున్నారని ఆరోపణల మీద ప్రభుత్వం సీరియస్ గా ఉందిని మంత్రి వివరించారు. కబ్జా యత్నం, భూముల దుర్వీనియోగం యత్నం మీద మీద వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో పురోగతి ఎంతవరకు వచ్చింది తెలుసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదుకు ఫిర్యాదులు చేశామని ప్రిన్సిపుల్ సెక్రటరీ సునీల్ శర్మ వివరించారు. దీంతో మంత్రి వెంటనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారుతో ఫోన్ లో మాట్లాడారు. పెద్దంబర్ పేట భూముల కబ్జా యత్నం ఫిర్యాదును సీరియస్ గా తీసుకోవానలి తాము నిర్ణయించిన నేపథ్యంలో వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ భూముల అక్రమార్కుల ను వదలేదని లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఇతర ప్రాంతాల్లోని తోహాస్, ఇతర రవాణా శాఖ భూముల మీద మంత్రి మరోసారి అడిగి తెలుసుకున్నారు. పేట్ బషీరాబాద్,తిమ్మాపూర్(కరీంనగర్),హనుమకొండ(వరంగల్), కామారెడ్డి, బాలానగర్(మహబూబ్ నగర్) జిల్లాలో తోహాస్ కు కేటాయించిన స్థలాలను,ఇతర స్థలాలు దుర్వీనియెగం, అన్యాక్రాంతం కాకుండా చూడాలని మంత్రి ఆదేశించారు.