
కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాడ్డక తొలిసారి ప్రజాస్వామ్య సంఘాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. వరంగల్ జిల్లాలో జరిగిన బూటకపు ఎన్ కౌంటర్ పై నిరసన వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్య సంఘాలు నిన్న చలో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించాయి.. దీన్ని పోలీసులకు సవాలుగా మారింది. జిల్లాల్లోనే పోలీసులు ఎక్కడివారిని అక్కడే అరెస్ట్ లు చేసి అందరినీ నిలువరించారు.
హైదరాబాద్ లో అసెంబ్లీ వద్ద పోలీసు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంక్షలు పెట్టారు. తనిఖీ చేశారు. ప్రజాస్వామ్య నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి జైలు కు తరలించారు. మొత్తానికి మొదటి ఉద్యమ సెగ ప్రభుత్వానికి, కేసీఆర్ కు బాగానే తగిలింది..