
హైదరాబాద్ (పిఎఫ్ ప్రతినిధి): సౌతాఫ్రికాతో జరుగుతున్న మండేలా-గాంధీ టెస్టు సిరిస్ లో భారత్ విజయం సాధించి 1-0 తేడాతో ముందంజలో ఉంది. స్పిన్ కు బాగా సహకరిస్తున్న పిచ్ పై భారత బౌలర్ల హవా కొనసాగింది. అశ్విన్, జడేజాలు స్పిన్ మాయాజాలం చేసి మ్యాచ్ మొత్తాన్ని శాసించారు. జడేజా ఈ రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి టెస్లుల్లో 50 వికెట్ల మైలు రాయిని దాటాడు. బౌలింగ్ లోనే కాకుండా బ్యాటింగ్ లోనూ రాణించిన జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. 108 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు రోజుల్లోనే మ్యాచ్ ను శాసించింది భారత్. భారత్ రెండో ఇన్నింగ్స్ 201 పరుగులు, సౌతాఫ్రికా 109 పరుగులకే కుప్పకూలింది.