తొమ్మిది మంది సభ్యుల గల దోపిడి ముఠా అరెస్ట్

కరీంనగర్: గతకొన్ని రోజుల నుండి కరీంనగర్ శివారు ప్రాంతాల్లో నిలిపి ఉన్న వాహనాల అద్దాలను పగులగొట్టి, డ్త్ర్రెవర్లు, క్లీనర్ లపై దౌర్జన్యానికి, దాడులకు పాల్పడుతూ దోపిడీలు చేస్తున్న 9మంది సభ్యులు గల ముఠాను మంగళవారం నాడు కరీంనగర్ త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా వద్ద నుండి మూడు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ ఫోన్ లు, నాలుగు వేల రూపాయల నగదును స్వాదీనం చేసుకున్నారు. కమీషనరేట్ కేంద్రంలోని దివంగత ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి వివరాలను వెల్లడించారు. మధ్యలో చదువు మానేసిన ప్రస్తుతం విద్యాభ్యాసం కొనసాగిస్తున్న కరీంనగర్ లోని వివిధ ప్రాంతాలకు చెందిన మిర్యాల్కర్ సాయి(20), కోహెడ్ వేణు(20), గుట్టం సాయిరాం(19), దేవకార్తిక్(24), గుమ్మడి రాజేష్(24), మదిరె హరీష్(20), కూరెళ్ళ సాయిచంద్ అలియాస్ చందు(21), మామిడిపల్లి భువనేశ్వర్ లు ఒక ముఠాగా ఏర్పడి, వ్యసనాలకు బానిసలై, అవసరాల కోసం
కరీంనగర్ శివారు ప్రాంతాల్లో నిలిపి ఉన్న వాహనాల అద్దాలను పగులగొట్టి, డ్త్ర్రెవర్, క్లీనర్ లపై దౌర్జన్యం, దాడులకు పాల్పడి దోపిడీలు చేస్తున్నారని ఈ తరహ నేరాలు ఈ మధ్యకాలంలో తరుచూ జరుగుతుండటంలో కరీంనగర్ ఎస్ పి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఈ ముఠా తచ్చాడుతున్నట్లుగా ఎస్ పికి అందిన సమాచారం మేరకు త్రీటౌన్ సిఐ సదానందం ఆధ్వర్యంలో పోలీసు బృందంతో వెళ్ళి సదరు యువకులను  అదుపులోకి తీపుకొని విచారించగా వారు పాల్పడిన దోపిడి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. కరీంనగర్ శివారుల్లో జరిగిన నాలుగు నేరాల్లో పైన పేర్కొన్న యువకులు నిందితులను అరెస్ట్ చేసి అనంతరం కోర్టులో హజరుపరిచారు. నేరాల చేధనలో కీలకపాత్ర పోషించిన పోలీసు అధికారులు, సిబ్బందికి పోలీస్ కమీషనర్ నగదు రివార్డులను అందజేసి అభినందించారు.

తల్లి దండ్రుల పర్యవేక్షణ కరువై నేరస్ధులుగా మారుతున్నారు:

ఎక్కువ శాతం మంది యువత తల్లిదండ్రుల పర్యవేక్షణ కరువై చెడు సహవాసాలు చేస్తూ వ్యసనాలకు బానిసలవుతూ నేరస్ధులుగా మారుతున్నారని కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి అన్నారు. విద్యార్ధుల ప్రతి కదలికను తల్లిదండ్రులు గమనించాలని, అనుమానం వచ్చినట్లయితే వెంటనే నిలదీయాలని లేదా సరైన కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు. అవసరానికి మించి అడిగిందే తడువుగా డబ్బులు ఇవ్వడం వల్లకూడా చెడు సహవాసాలు చేస్తూ మద్యం, మత్తుపదార్ధాలకు బానిసలయ్యే ప్రమాదం ఉందన్నారు. విద్యార్ధులు లక్ష్యసాధనపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. చెడు సహవాసాలతో చిన్నచిన్న నేరాలకు పాల్పడినా నేరస్ధులుగా ముద్రపడుతుందని, తద్వారా ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అభించవని తెలిపారు. విద్యార్ధుల్లో నేరప్రవృత్తి దరిచేరకుండా ఉండేందుకు ఆయా విద్యాసంస్ధలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాలకు తమవంతు సహకారం కూడా అందజేస్తామని తెలిపారు. చెడు నడతగల వ్యక్తుల్లో మార్పు తీసుకురావడం సామాజిక బాధ్యతగా అన్నివర్గాల ప్రజలు స్వీకరించాలని కోరారు.

నేరాల చేధనపై దృష్టి సారించాం:

కమీషనరేట్ పరిధిలో జరిగిన వివిధ రకాల దోపిడి, దొంగతనాల కేసుల చేధనపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి అన్నారు ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలో ఐదింటిని చేధించడం జరిగిందన్నారు. నేరాల చేధనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో బ్లూకోట్స్ ద్వారా పోలీస్ విజబులిట్ పెరిగిందని పేర్కొన్నారు. దోపిడి, దొంగతనాలు జరిగిన సందర్భంలో బాధితులు, ప్రజలు సంఘటన స్ధలంలోని ఆధారాలను చెడిపోకుండా చూడాలన్నారు. సంఘటన
అనంతరం క్లూస్ టీం వచ్చి పరిశీలించేంత వరకు చుట్టుపక్కల ఉన్న వస్తువులను ముట్టుకోకూడదని చెప్పారు. ఆధారాలు లభించకపోయినట్లయితే కేసు చేధించడం కష్టసాధ్యం అవుతుందని పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో నగరంలో ఒక అంతర్ జిల్లా దొంగల ముఠా సంచరిస్తున్నట్లు సమాచారం అందుతోందని తెలిపారు. ఈ ముఠా సభ్యులు ఎవరికి అనుమానం కలుగకుండా ఒక మోటార్ సైకిల్ పై సంచరిస్తూ ఒకచిన్న పాపతో భార్యాభర్తలుగా చలామణి అవుతున్నట్లు తెలుస్తోందని చెప్పారు. దూర ప్రయాణాలకు వెళ్ళాల్సి వస్తే సమీప బంధువులను ఇంట్లో ఉంచి వెళ్ళాలని, ఎవరికీ చెప్పకుండా ఇళ్ళకు తాళం వేసి రోజుల తరబడి వెళ్ళకూడదని సూచించారు. నేరాల నియంత్రణలో అన్ని వర్గాల ప్రజలు తమవంతు సహకారం అందజేయాలని కోరారు.

డిజెలను వినియోగించకూడదు:

కమీషనరేట్ పరిధిలో డిజెల వినియోగం అమల్లో ఉన్నందున డిజెలను వినియోగించకూడదని కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి అన్నారు. డిజె సౌండ్ సిస్టమ్ లో ఉన్న మిక్సర్లను తొలగించాలని సూచించారు. డిజెల వినియోగం వల్ల శబ్ధ కాలుష్యం
ఏర్పడుతో పాటు వృద్ధులకు, రోగులకు, విద్యాభ్యాసం కొనసాగించే వారికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. డిజెల యజమానులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని, మార్పురాకపోయినట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి తెలిపారు.

ఈ సమావేశంలో అడిషనల్ సిపి టి.అన్నపూర్ణ, ఎసిపి జె.రామారావు, ఇన్స్ పెక్టర్లు సదానందం, హరిప్రసాద్ లు, ఎస్.ఐలు సి.హెచ్ సాగర్, ఎల్లయ్య గౌడ్ తదితరలు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.