
మదుప్రియ.. తెలంగాణ పాటలతో ఆటలతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన వర్థమాన గాయని.. ఇప్పుడు మాత్రం ప్రేమ వ్యవహారంలో పీకల్లోతూ మునిగి ప్రియుడిని పెళ్లాడి కన్నవాళ్లకు కడగండ్లు మిగిలిచ్చింది.. 18 ఏళ్ల వయసు నెల క్రితమే నిండింది. మొన్నటి దాక మధుప్రియ మైనరే.. రెండేళ్లుగా శ్రీకాంత్ అనే యువకుడితో ప్రేమాయణం కొనసాగించింది. అంటే 16 వ ఏటనే ఈ అమ్మడు ప్రేమ కలాపాలు కొనసాగించింది. చదువుకోవాల్సిన వయసులో ప్రేమ మైకంలో శ్రీకాంత్ తో పరిచయం పెంచకొని ఇప్పుడు పెళ్లి చేసుకొని బంగారంలాంటి భవిష్యత్తును నాశనం చేసుకుందని మధుప్రియ తల్లిదండ్రులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
మంచి భవిష్యత్తుకు ఎదుగుతుందనకుంటే ఇలా ఫూలిష్ గా అన్ మెచ్చురిటీతో చేసిందని మధుప్రియ గురించి బాహాటంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. ఆమె మైనర్ గా ఉన్నప్పుడే శ్రీకాంత్ తో పెళ్లి అయ్యిందని శ్రీకాంత్ తల్లి పేర్కొనడం గమనార్హం. మైనర్ గా పెళ్లి చేసుకుంటే కేసులు అవుతాయని అందుకే ఇప్పుడు మైనార్టీ తీరాక పెళ్లి చేసుకుందని తెలిపారు.