
రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు సోకులకు పోయి ప్రజాధనాన్ని పప్పుబెల్లాల్ల ఖర్చు చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అయితే ఇఫ్పటికే నెలకు ఒకటి చొప్పున విదేశీ పర్యటనకు గంపగుత్త మిత్రులు , వ్యాపారులను వెంట బెట్టుకొని వెళ్తున్నారు. దీనికోసం ఏకంగా ప్రైవేటు ఒక ఆధునిక విమానాలను బుక్ చేసుకుంటున్నారు. కోట్ల విలువైన ప్రత్యేక విమానం ఖర్చుతో అసలే కూనరిల్లుతున్న ఏపీ ఆర్థిక స్థితి మరింత దిగుజారుతోంది..
ఇక ఇదే బాటలో మరో దుబారా కు తెరతీశారు తెలంగాణ సీఎం కేసీఆర్. చైనాలో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు వ్యాపారులు, అధికారులు పోయేందుకు వీలుగా 2 కోట్ల ప్రజాధనం వెచ్చించి ప్రత్యేక విమానం బుక్ చేశాడు.. దాంట్లో వారంపాటు చైనా, జపాన్, కొరియాల్లో పర్యటించనున్నారు.
అంతా బాగానే ఉన్నా సాధారణ విమానాల్లో వీరు వెళ్లడానికి నామోషీగా ఫీలవుతున్నారు. అందుకే కోట్ల ఖర్చుతో ప్రత్యేక విమానాలు బుక్ చేసి వెళుతూ ప్రజాధనాన్ని లూటీ చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.