Breaking News

తెలుగు సినిమాపై రాష్ట్ర విభజన ఎఫెక్ట్ లేదు..

rajamouli-647x450

తెలుగు సినిమా పరిశ్రమపై రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడు రెండు రాష్ట్రాలు, వాటి వ్యవహారశైలి ప్రభావం ఇప్పుడు ఏమాత్రం లేదన్నారు స్టార్ డైరెక్టర్ రాజమౌళి.. రాష్ట్ర విభజన సమయంలో అందరూ ఉత్కంఠకు, ఆవేశానికి లోనైనా మాట వాస్తవమేనని.. సినిమా పరిశ్రమ కూడా ఆ సమయంలో గందరగోళ పరిస్థితుల్లో ఉందని కానీ ఇప్పుడు ఆ సమస్య లేదన్నారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడారు.

తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ విడిచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లదని రాజమౌళి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు ముందు కూడా ప్రజల్లో ఆగ్రహం తమ సినిమా పరిశ్రమపై పెద్దగా ప్రబావం చూపలేదన్నారు. కొన్ని చిన్న సంఘటనలు మినహా ఎవరూ హద్దు దాటలేదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాకా ప్రశాంత వాతావరణం నెలకొందని.. శాంతియుతంగా సినిమా షూటింగ్ లు జరుగుతున్నాయన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *