తెలుగు రాష్ట్రాల్లో నిలిచిపోయిన బస్సులు

హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె కారణంగా తెలుగు రాష్ట్రాల్లో (ఏపీ తెలంగాణ) బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీ కార్మికులు కోరిన 43శాతం ఫిట్ మెంటుకు యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. యాజమాన్యం 27శాతం ఫిట్ మెంట్ మాత్రమే ఇచ్చేందుకు సమ్మతించడం కార్మిక సంఘాలు దాన్ని తిరస్కరించడం జరిగింది. ఈ నేపథ్యంలో సమ్మె అనివార్యమైంది.

సమ్మె కారణంగా రెండు రాష్ట్రాల్లోని అని డిపోల్లో బస్సులు ఆగిపోయాయి. ఆర్టీసీ ప్రత్యామ్మాయా ఏర్పాట్లు చేసింది. కాంట్రాక్టు డ్రైవర్లు, కండెక్టర్లను నియమించి బస్సులను నడుపుతోంది. అన్ని ప్రైవేటు , క్యారేజ్ వాహనాలకు ప్రయాణికులను తరలించేందుకు అనుమతి ఇచ్చింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *