తెలుగు యూనివర్శిటీ పరిపాలనా భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

తెలుగు యూనివర్శిటీ పరిపాలనా భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

ప్రభుత్వం తెలంగాణ యూనివర్శిటీలను పటిష్టం చేస్తోంది

విశ్వవిద్యాలయాల్లో 1551 అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు సిఎం కేసిఆర్ ఆమోదం తెలిపారు.

విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కోసం 420 కోట్ల రూపాయలు మంజూరు చేశారు

తెలుగు విశ్వవిద్యాలయానికి బిల్డింగ్ గ్రాంట్ కింద 20 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి

ఈరోజు పరిపాలన భవనం కోసం 3.4 కోట్ల రూపాయలతో శంకుస్థాపన

కష్టపడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడంలో విద్యాశాఖ పాత్ర ముఖ్యమైంది

ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను అందించడం వల్ల మానవ వనరుల అభివృద్ధి జరుగుతుంది

గత మూడేళ్లగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తెస్తున్నాం..ఇంజనీరింగ్ కాలేజీలను, ప్రైవేట్ విద్యాలయాలను నియంత్రిస్తున్నాం

ఉత్తీర్ణులకంటే ఎక్కువగా కాలేజీలలో సీట్లు ఉండడాన్ని రెగ్యులేట్ చేశాం

గతంలో ఇబ్బడిముబ్బడిగా కాలేజీలకు అనుమతి ఇవ్వడం వల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ప్రమాణాలు తగ్గాయి

తెలంగాణ వచ్చాక ఆన్ లైన్ అడ్మిషన్లు చేస్తున్నాం…ప్రభుత్వ విద్యను పటిష్టం చేస్తున్నాం

తెలంగాణ రాష్ట్రంలో చదివే విద్యార్థి 1 నుంచి 12 వరకు తెలుగు నేర్చుకోవాలని సిఎం కేసిఆర్ ఆదేశించారు.

దీని కార్యాచరణకోసం తెలుగు విశ్వవిద్యాలయం వీసీ సత్యనారాయణ చైర్మన్ గా కమిటీ వేశాం…ప్రతిపాదనలు ఇచ్చారు…వీటిని ప్రభుత్వం ఆమోదించింది

తెలంగాణలో చదివే ప్రతి విద్యార్థి తెలుగు చదవాలి, రాయాలి, మాట్లాడాలి …అందుకే తెలుగును సులభతరంగా మార్చే సిలబస్ రూపొందిస్తున్నాం

తెలుగు విశ్వవిద్యాలయం ఖ్యాతి ఇనుమడింపజేసే విధంగా యూనివర్శిటీ ప్రొగ్రామ్స్, కోర్సులుండాలి

2018-19 అకాడమిక్ సంవత్సరం నుంచి అన్ని విద్యాలయాల్లో తప్పనిసరి తెలుగు అమలు

హైదరాబాద్, ఫిబ్రవరి 05 : తెలుగు భాష అభివృద్ధికి కొత్త, కొత్త కోర్సులు రూపొందించి, తెలంగాణ తెలుగు విశ్వవిద్యాలయం ఖ్యాతి ఇనుమడింపజేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కోరారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 3.4 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న పరిపాలన భవనానికి ఆయన నేడు శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ విద్యను పటిష్టం చేసేందుకు అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసేందుకు 1551 అధ్యాపక పోస్టులను భర్తీ చేసుకునేందుకు సిఎం కేసిఆర్ అనుమతినిచ్చారని తెలిపారు. అదేవిధంగా మౌలిక వసతుల అభివృద్ధికోసం 420 కోట్ల రూపాయలను 2017-18 బడ్జెట్ లోనే కేటాయించారన్నారు. ఇందులో తెలుగు విశ్వవిద్యాలయానికి 20 కోట్ల రూపాయలను భవనాల కోసం కేటాయించామన్నారు. వీటితో పాటు ప్రైవేట్ రంగంలోని ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల్లో సీట్లను నియంత్రంచే కార్యక్రమం చేపడుతున్నామని, తద్వారా ప్రమాణాలున్న విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు ఇబ్బడిముబ్బడిగా కాలేజీలకు అనుమతినివ్వడం వల్ల ప్రభుత్వ విద్యలో ప్రమాణాలే పడిపోయాయన్నారు. గత మూడేళ్లుగా ప్రభుత్వ విద్యను పటిష్టం చేస్తున్నామన్నారు. గతంలో రాష్ట్రంలో ఇంటర్ లో 2,20,000 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతుంటే…డిగ్రీ కాలేజీల్లో 4,40,000 సీట్లకు అనుమతినిచ్చారని తెలిపారు. అదేవిధంగా ఎంసెట్ క్వాలిఫై అయ్యే విద్యార్థులు లక్ష మంది ఉంటే ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల సంఖ్య 2,60,000 ఉన్నాయని, దీనివల్ల విద్యలో ప్రమాణాలు లేకుండా పోయాయన్నారు.

kadiyam srihari 2

తెలంగాణ ప్రభుత్వంలో నిబంధనలు కఠినతరం చేయడం వల్ల ప్రమాణాలు లేని కాలేజీలు మూతపడుతున్నాయని చెప్పారు. తెలంగాణలో చదువుకున్న విద్యార్థి ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడే విధంగా ఉండాలని సిఎం కేసిఆర్ సూచించారని, ఆ మేరకు తెలంగాణ విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.  కష్టపడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడంలో మానవ వనరుల అభివృద్ధే కీలకమని సిఎం కేసిఆర్ పదే, పదే చెబుతుంటారని, ఈ మానవ వనరుల అభివృద్ధి చేయడంలో విద్యాశాఖ పాత్ర కీలకమైందన్నారు. తెలంగాణలో చదివే విద్యార్థులందరూ తెలుగు తప్పనిసరిగా నేర్చుకోవాలని, రాయాలని, చదవాలనే ఆకాంక్ష అన్నారు. ఈమేరకు తెలుగు విశ్వవిద్యాలయం వీసి ప్రొఫెసర్ సత్యనారాయణ చైర్మన్ గా కమిటీ వేశామని, ఈ కమిటీ తన ప్రతిపాదనలు రూపొందించిందని, ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి తెలుగు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యాలయాల్లో తప్పనిసరిగా అమలు చేస్తామన్నారు. ఇందుకోసం తెలుగును సులభతరంగా నేర్చుకునేలా సిలబస్ రూపొందిస్తున్నామన్నారు. తెలంగాణ తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాషను అభివృద్ధి చేసేలా, ఈ విశ్వవిద్యాలయం ఖ్యాతి ఇనుమడింపజేసేలా పనిచేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రొఫెసర్ సత్యనారాయణ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శ్రీమతి అలేఖ్య, అకాశవాణి డైరెక్టర్ ఉదయ్ కిరణ్, ఉపాధ్యాయ,
ఉపాధ్యాయేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

kadiyam srihari 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *