తెలుగు భాషను తపనిసరి సబ్జెక్ట్ గా చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ప్రశంసానీయం:వెంకయ్య నాయుడు

తెలుగు భాష గొప్పతనాని సంస్కృతి సంప్రదాయాలను భవిష్యతు తరాలకు నేర్చుకునేందుకు వీలుగా ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు తెలుగు భాషను తపనిసరి సబ్జెక్ట్ గ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం సర్వదా ప్రశంశానియం అని, ఇదే చొరవను పాలనలో కూడా చూపి ప్రభుత్వ వ్యవహారాలన్నీ తెలుగులోనే జరిగేలా నిర్ణయం తీసుకుంటే భాష మరింతగా అభివృధి చెందే అవకాశం ఉంటుందని భారత దేశ ఉప రాష్ట్రపతి ఏం. వెంకయ్య నాయుడు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వ ఆద్వర్యంలో L.B  స్టేడియం లోని,పాల్కురికి సోమన ప్రాంగణం, బమ్మెర పోతన వేదిక పై అట్టహాసంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహా సభలను శుక్రవారం  ముఖ్యమంత్రి కే.సి.ఆర్, మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యా సాగర్ రావు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ తో కలిసి  జ్యోతి ప్రజ్వలన చేసి లాంచనంగా ప్రారంభించారు. తొలుత వేదిక పై ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తెలుగు భాష వ్యాప్తికి ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు చేస్తున కృషి అమోఘం అని విద్యా వ్యవస్థలో తెలుగు కి కీలక స్థానం కల్పించిన తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో కూడా మాత్రు బాషకు పెద్ద పీట వేయాలని ఆన్నారు.

తెలుగు భాష మాదుర్యం ఎంతో గొప్పదని ఆ మాధుర్యాని ఆస్వాదించి పది మందికి పంచేందుకు, తెలుగు భాష దశ దిశల వ్యాప్తి చెందేందుకు సమిష్టిగా కృషి జరగాలని ఆన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోను తీసుకోవాలని ఆన్నారు.  దేశం లో హింది తరువాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగే అని అంతటి ప్రాముఖ్యత గల భాషనూ ప్రతి ఒక్కరు నేర్చుకునేందుకు వీలుగా తెలుగు లో తెలంగాణ ముఖ్యమంత్రి మహా నిగంటువును రూపొందించుకోవాలని ఆన్నారు.

తెలంగాణ గడ్డ పై పుట్టిన కాళోజి, సినారె, సురవరం ప్రతాప రెడ్డి వంటి సాహితి వెత్తల గొప్పతనాని వివరిస్తూ ఆయన తమ రచనల ద్వార తెలంగాణ ప్రజా సాహిత్యానికి వారు ఉపిరి పోసారు ఆన్నారు. ముఖ్యంగా ప్రశ్నించే సాహిత్యం, ప్రతిగటించే సాహిత్యం తెలంగాణ లో ప్రాణం పోసుకుంది అని ఆన్నారు.  ఈ సందర్భం గా తెలుగు భాషనూ విశ్వ వ్యాప్తం చేసేందుకే చేపట్టిన ప్రపంచ టెలుగు మహా సభల నిర్వహణ విజయవంతం గా సాగాలని ఆయన ఆకాంక్షించారు .

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ తెలంగాణ అద్భుతమైన సాహిత్యాని పోషించిన గడ్డ అని, పదోవ శతాబ్దం లోనే సాహిత్య సౌరభాలు వెదజల్లిన నెల తెలంగాణా మగానమని అని ఆన్నారు. రామారాజు, దాశరధి, సురవరం ప్రతాపరెడ్డి, సినారె, కాళోజి వంటి ఆనాటి గొప్ప కవులు, సుదాల హనుమంతు, అందె శ్రీ గొరేటి వెంకన్న, అంపశయ్య నవీన్, ముదిగంటి సుజాత రెడ్డి ఈనాటి కవులు వీరందరు తెలంగాణ బిడ్డలే అని తెలంగాణ గొప్పతనాని వివరించారు. చిన్నతనం నుండి తెలుగు భాష పై తనకు గల మక్కువ ను తెలియ జెప్తూ, ఇందుకు కారణం తన గురువు మృత్యుంజయ శర్మ ని ఆన్నారు ఈ సందర్భం గా గురువు ని సభకు పరిచయం చేసి సాదరం గ సత్కరించారు. తెలుగు భాషభి వృద్దికి తమ ప్రభుత్వం తీసుకుంటున్నచర్యలను వివరిస్తూ ఆయన ప్రతి సంవతరం మహా కవులు అయిన దాశరధి, కాళోజి పేరిట సాహిత్య అవార్డులను అందచేస్తునాం ఆన్నారు. భవిష్యతు తరాలలో తెలుగు ను  వ్రుదిచేసేందుకు ఒకటి నుండి పన్నెండు తరగతి వరకు తెలుగును తపనిసరి సరి సబ్జెక్ట్ గ చేసాం ఆన్నారు.

భాషాభిమానులు, భాషవేతలు ఒక కవిని, సాహితి వెతను తాయారు చేసేందుకు నడుము కట్టాలని, తెలుగు భాష గొప్పతనాని ముందు తరాలకు అందించాలన్న సంకల్పాని మన అందరం తీసుకోవాలని  ఈ సందర్భం గా ముఖ్యమంత్రి కోరారు.

రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ మాట్లాడుతూ హైదరాబాద్ లో ఈ సభను చూస్తుంటే ఆది కవి నన్నయ్య నుండి సి నారాయణ రెడ్డి వరకు అందరు కలిసి భువన విజయం జరుపుతునట్లు గ వుందంటూ ప్రశంసించారు. తెలుగు భాష ను సుసపన్నం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని ఆన్నారు. ఆనాటి తెలంగాణ కోటి రతనాల వీణ ఈనాటి కోటి గొంతుకల భాష ప్రవీనగా మారాలని ఆయన ఆకాంక్షించారు.

మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యా సాగర్ రావు మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహా సభలు ఇంత బ్రహ్మాండం గ జరుగుతాయని ఉహించాలేదని,ఇది కేవలం ముఖ్యమంత్రి కే.సి.ఆర్. కే సాద్యం అని  ఆన్నారు. తెలుగు భాష విశ్వ జనీనం అయినదని,   దేశం లో హింది తరువాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగే అని ఆన్నారు. యునేస్కో చేపినట్లుగా తలితండ్రులు తపని సరిగా తెలుగు నేర్పించాలని సూచించారు. ఇంత గొప్పగా ఈ సభలు నిర్వహిస్తున ముఖ్యమంత్రి వివిధ రాష్ట్రాలలో తెలుగు వారికీ గల బాష సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని, ప్రపంచ వ్యాప్తం గ  గల తెలుగు వారిని ఒకతాటి పై   తేచి తెలుగు భాష కు మరింత కీర్తిని సాధించాలని ఆన్నారు.

ఎంపి అసదుదిన్ ఒవైసీ,  తెలుగు లో మాట్లాడి సభికులను ఆకటుకునారు. ఈ కార్యక్రమంలో  శాశన మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాశన సభాపతి మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, ఎంపిలు  కే కేశవరావు, జితేందర్ రెడ్డి , సాహిత్య అకాడమి చైర్మన్ నందిని సిధా రెడ్డి,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ పి సింగ్  తదితరులు పాల్గొన్నారు. సభకు ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే. వి. రమణాచారి సంధాన కర్తగా వ్యవహరించారు. వక్తల ప్రసంగాలు ముగిసిన తరువాత నిర్వహించిన ఫైర్ క్రాకర్స్ ఆహుతూలను ఎంతగానో ఆకటుకుంది.                                                                                                                                                                                                              KLN_7451 KLN_7371

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *