తెలుగు పత్రికా రంగంలోకి టైమ్స్ ఆఫ్ ఇండియా

దేశవ్యాప్తంగా విస్తరించిన టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంగ్ల దినపత్రిక తెలుగులో ఓ పత్రిక తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ముంబై నుంచి ఓ టీమ్ హైదరాబాద్ వచ్చి ఇక్కడి పరిస్థితులపై కొందరు ముఖ్యులతో సమాలోచనలు జరుపుతోంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇంగ్లీష్ లో వస్తున్న టౌమ్స్ ఆఫ్ ఇండియా విస్తరణకు అడుగులు వేస్తోంది. అందులో భాగంగా హిందీ, తెలుగుల్లో పత్రికలను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది.

ఇన్నాళ్లు తెలుగు పత్రికారంగంలో గుత్తాధిపత్యం చెలాయిస్తున్న ఈనాడుకు పోటీగానే ఆ స్థాయిలో పత్రికాను తీసుకురావాలనుకుంటున్నామని వారు తెలిపారు. ఈనాడు గ్రూప్ లో ఇప్పటికే రిలయన్స్ భారీగా పెట్టుబడులు పెట్టి విస్తరించింది. ఆలాగే టౌమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా పెట్టుబడుల ప్రవాహం మొదలైంది.  అందుకే ముందుగా ప్రాంతీయ భాషల్లో పత్రికలు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ఈనాడు దినపత్రికకు ధీటుగా పత్రికను తీసుకువచ్చి తెలుగులో మొదటిస్థానాన్ని ఆక్రమించాలని స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. తెలుగులో త్వరలోనే మరో పత్రిక భారీ పెట్టుబడులతో రావడంపై జర్నలిస్టుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *