తెలంగాణలోని 4 యూనివర్సిటీలకు వీసీల నియామకం

హైదరాబాద్ : ఎట్టకేలకు తెలంగాణలోని యూనివర్సిటీల్లో వైస్ చాన్సలర్ల ఖాళీలు భర్తీ అయ్యాయి. తెలంగాణలోని శాతవాహన, కాకతీయ, మహాత్మాగాంధీ, తెలుగు విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం ఇన్ చార్జ్ వైస్ చాన్సలర్ గా – పాఠశాల వైస్ చాన్స్ లర్ గా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చిరంజీవులును నియమించారు.

కరీంనగర్ లోని శాతవాహన విశ్వవిద్యాలయం ఇన్ చార్జ్ వైస్ చాన్సలర్ గా -విశ్రాంత ప్రొఫెసర్ (ఉస్మానియా) కే.వీరారెడ్డి
నల్గొండ లోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఇన్ చార్జిగా సాంకేతిక విద్య కమిషనర్ గా ఏ.వాణి ప్రసాద్ ను ప్రభుత్వం నియమించింది.

హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఇన్ చార్జ్ వైస్ చాన్సలర్ గా విశ్రాంత ప్రొఫెసర్ గా ఎల్లూరి శివారెడ్డి నియమితులయ్యారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వీరినే నియమిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *