
- తెలంగాణ సుభిక్ష, సుందర రాష్ర్టం
తెలంగాణ పట్ల ప్రధాని మోడికి ప్రత్యేక అభిమానం
చారిత్రక ఘట్టాలకు… తెలంగాణ నిలువుటద్దం
టూరిజంతో తెలంగాణ భవితవ్యం మారనుంది
కేసీఆర్ విజన్.. తెలంగాణకు ఆయువు
హరితహారం.. దేశంలోనే గొప్ప కార్యక్రమం
తెలంగాణకు కేంద్రం అండగా ఉంటుంది
మంత్రి జోగు రామన్న అంకితభావం ఉన్న వ్యక్తి
కేంద్ర అటవీ, పర్యావరణ, కల్చరల్ మంత్రి మహేష్ శర్మ
. తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచన విధానాలను కొనియాడారు.
హైదరాబాద్, జనవరి 6 : తెలంగాణ సుభిక్ష.. సుందర.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ర్టం అనికేంద్ర అటవీ, పర్యావరణ, కల్చరల్ శాఖల మంత్రి డాక్టర్ మహేష్ శర్మ పేర్కొన్నారు. శనివారం ఆర్ ఎఫ్ సీ లోనిహోటల్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి క్యాలెండర్, స్టిక్కర్స్‌ను, ఈపీటీఆర్ఐ వార్షిక నివేదికలను కేంద్ర మంత్రి మహేష్ శర్మ, రాష్ర్ట అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి జోగు రామన్నలు కలిసిఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మహేష్ శర్మ మాట్లాడుతూ.ర్ గొప్ప పథకాలను రూపొందించిఅమలు చేస్తున్నారని కితాబిచ్చారు. సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు అని, ఆయన తీసుకుంటున్నవినూత్న నిర్ణయాలు తెలంగాణ రాష్ర్టానికి ఆయువు అని ఆయన పేర్కొన్నారు. చారిత్రక ఘట్టాలకు తెలంగాణనిలువుటద్దం అని ఆయన అన్నారు. అందుకే తెలంగాణ రాష్ర్టం పట్ల ప్రధాని నరేంద్రకి ప్రత్యేక అభిమానం అనిఆయన అన్నారు. తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని, తెలంగాణకు కేంద్రం
అండగా ఉంటుందని కేంద్ర మంత్రి మహేష్ శర్మ తెలిపారు. హరితహారం కార్యక్రమం తెలంగాణ మెడలో
మణిహారమని, హరితహారం కార్యక్రమం దేశానికే ఆదర్శమన్నారు. నాలుగేళ్లలో 230 కోట్ల మొక్కలను నాటడం
అంటే మామూలు విషయం కాదని ఆయన అన్నారు. హెలిక్యాప్టర్ ద్వారా వస్తుండగా తెలంగాణలో గ్రీనరిని
గమనించానని అన్నారు. టూరిజానికి మంచి భవిష్యత్తు ఉందని, టూరిజం ద్వారా తెలంగాణ భవిష్యత్
మారనుందన్నారు. రాష్ర్ట అటవీ, పర్యవారణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న పథకాలతో తెలంగాణ రాష్ర్టం దేశంలోనే అనేక రంగాల్లో అగ్రగామిగా
నిలుస్తోందని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో లైవ్ స్టాక్ హెరిటేజ్ ఫాం నెలకొల్పాలని జోగు రామన్న కేంద్ర
మంత్రిని కోరుతూ.. వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణలో హరితహారంతోపాటు అనేక వినూత్న పథకాలను
మంత్రి జోగు రామన్న వివరించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, పీసీబీ
మెంజర్ సెక్రటరీ సత్యనారాయణ రెడ్డి, ఈపీటీఆర్ ఐ డైరెక్టర్ జనరల్ కల్యాణ చక్రవర్తి, పీసీసీఎఫ్ ప్రశాంత్ కుమార్
ఝా, తదితరులు పాల్గొన్నారు.