తెలంగాణ సాగునీటి పథకాలకు అంతర్జాతీయ ప్రశంసలు – ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎస్.కే.జోషి

తెలంగాణ సాగునీటి పథకాలకు అంతర్జాతీయ ప్రశంసలు. మూడున్నరేళ్ళ కొత్త రాష్ట్రం సాధిస్తున్న ఇరిగేషన్ ప్రగతిపై దిగ్భ్రాంతి.

జలసౌధలో రెండు గంటలకు పైగా విదేశీ ప్రతినిధులకు ప్రజంటేషన్.

తెలంగాణలో చేపడుతున్న మిషన్ కాకతీయ పథకం ,కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి అంతర్జాతీయంగా ప్రశంసలు వేల్లువేత్తుతున్నాయి. ఇరిగేషన్ రంగంలో తెలంగాణ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు,చేపట్టిన పథకాలపై ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎస్.కే.జోషి శనివారం ఇక్కడ జలసౌధలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో 19 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.తెలంగాణలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అధ్యయనం కోసం నాలుగు వారాల పర్యటనకు వారు హైదరాబాద్ చేరుకున్నారు. ఇందులో భాగంగా ఇరిగేషన్ రంగంలో ప్రగతిని తెలుసుకునేందుకు అడ్మినిష్ట్రేటివ్ కాలేజ్ ఆఫ్ ఇండియా విదేశీ ప్రతినిధుల పర్యటనను సమన్వయపరుస్తున్నది. సాగునీటిపారుదల పథకాలపై ప్రభుత్వం ఇచ్చిన ప్రజంటేషన్ పట్ల విదేశీ ప్రతినిధులంతా నివ్వెరపోయారు.కొత్తగా మూడున్నర సంవత్సరాల క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ రంగంలో సాధించిన ప్రగతి పై ప్రభుత్వస్పెషల్ సి.ఎస్. సోదాహరణంగా వివరించారు.

sk joshi 4

తెలంగాణ ఏర్పడకముందు దాదాపు 80,000 చిన్న నీటి పారుదల వనరులు ఉండగా అర్బనైజేషన్, తదితర కారణాల వల్ల అందులో సగం కనుమరుగయ్యాయని జోషి చెప్పారు.గొలుసు కట్టు చెరువులతో పాటు మొత్తం చిన్న నీటి వనరులను పరిరక్షించేందుకు,వాటిని పునరుద్ధరణకు,పునర్నిర్మించడానికిగాను చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రూపకల్పన చేశారని అన్నారు. 46,000 చెరువులను దశలవారీగా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.మిషన్ కాకతీయ కార్యక్రమం అమలుతో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని, తెలంగాణ గ్రామీణ ఆర్ధిక, సామాజిక స్థితి గతులలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయని జోషి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్ర‌తి చెరువును నిండుకుండ గా  మార్చేందుకు చేప‌ట్టిన ఓ బృహ‌త్త‌ర య‌జ్ఞం అని ఆయన అన్నారు. ఇరిగేషన్ మంత్రి హ‌రీష్ రావు ఈ ప‌థ‌కం విజ‌య‌వంతానికి ప్రతి వారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తున్నారని, నిరంతరం పర్యవేక్షిస్తున్న కారణంగా సానుకూల ఫలితాలు వస్తున్నాయని చెప్పారు.

sk joshi 1

చెరువు మీద ఆధార‌ప‌డి వ్య‌వ‌సాయం చేసే రైతు తో పాటు, ఆ చెరువును న‌మ్ముకున్న ర‌జ‌క‌, బెస్త, ముదిరాజుల‌కు జీవ‌న బృతికి దొర‌కుతున్నదని జోషి వివరించారు. తెలంగాణలో జలవనరులు, నీటి లభ్యత పెంచడమే మిషన్ కాకతీయ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ స్పెషల్ సి.ఎస్. తెలియజేశారు. దేశంలోనే అత్యధిక చెరువులున్న రాష్ట్రంగా తెలంగాణకు చరిత్ర ఉందని చెప్పారు. ఏడాదికి 25 శాతం చెరువుల చొప్పున మిష‌న్ కాక‌తీయ కిందఅభివృద్దిపరుస్తూ, నాలుగేళ్ల‌ల‌లో మొత్తం చెరువుల‌కు పూర్వవైభ‌వం తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నామని అన్నారు.అంత‌ర్జాతీయ స‌మాజం కూడా మిష‌న్ కాక‌తీయ గ్రేట్ అంటూ అధ్య‌య‌నాలు చేస్తోందని, మిచిగాన్ యూనివ‌ర్సిటీ విద్యార్థులు కొంద‌రు తెలంగాణ‌లో ప‌ర్య‌టించి రీసెర్చ్ కూడా చేశారని జోషి వివరించారు.తెలంగాణ ప్రజలు,రైతుల జీవితాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయబోతున్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి విదేశీ ప్రతినిధులకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వివరించినప్పుడు ఆయా ప్రతినిధులు విస్తుబోయారు.8 0 0 0 0 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తమ ప్రభుత్వం చేపట్టిందన్నారు. మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం దగ్గర మూడు చోట్ల నిర్మిస్తున్న భారీ బ్యారేజీలు, మూడు పంపుహౌజ్ లు, పొడవైన సొరంగాలు,భూగర్భంలో అబ్బురపరిచే సర్జ్ పూల్స్ గురించి జోషి వివరించారు.

sk joshi 3

90 రోజుల పాటు రోజుకు 2 టీఎంసీల ఎత్తిపోయడానికి ఈ భారీ లిఫ్ట్ ఇరిగేషన్ పధకాన్ని నిర్మిస్తున్నట్టు చెప్పారు. 18.26 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకు రావడం,మరో 18. 82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యమని అన్నారు.మొత్తంగా 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని చెప్పారు.తాగునీటి అవసరాలకు 36, పారిశ్రామిక అవసరాలకు 10 టీఎంసీల నీరు వాడుతున్నట్టు తెలిపారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చేందుకు దీర్ఘకాలిక వ్యూహంతో ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టారని విదేశీ ప్రతినిధులకు వివరించారు.కాళేశ్వరం ప్రాజెక్టు లో వాడుతున్న అత్యాధునిక సాంకేతిక విధానాలు, ప్రయోగాలను తెలిపారు.పాలమూరు_రంగారెడ్డి ప్రాజెక్టు గురించి దాని ప్రయోజనాల గురించి కూడా జోషీ వివరించారు.దక్షిణాఫ్రికా ,ఇథియోపియా, శ్రీ లంక తదితర దేశాల ప్రతినిథులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.కాళేశ్వరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టుకు ఆర్ధిక వనరులు సమకూర్చుకున్న విధానాలు,ఇలాంటి ప్రాజెక్టు వల్ల విశాల ప్రాతిపదికన రైతులు,ఇతర రంగాల వారికి ఒనగూరుతున్న ప్రయోజనాలు,వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసే తీరు వంటి అంశాలపై ప్రభూత్వ సి.ఎస్.ను అడిగి తెలుసుకున్నారు.

sk joshi 2

తమ ప్రభుత్వం ఇరిగేషన్ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న కారణంగా వార్షిక బడ్జెట్ లో 2 5 శాతాన్ని ఈ రంగానికే కేటాయిస్తున్నట్టు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ స్పెషల్ సి.ఎస్.తో పాటు  కాడా కమిషనర్ డాక్టర్ మల్సూర్,మైనర్ ఇరిగేషన్ సి.ఇ.లు సురేష్, శ్యాం సుందర్ ,ఆస్కీ  ప్రోగ్రాం డైరెక్టర్లు డాక్టర్ పి.సుభాషిణి, రాజ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

sk joshi 5

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *