తెలంగాణ వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌కు పూర్వ వైభ‌వ‌మే సీఎం కేసీఆర్‌, కేటీఆర్ ల‌క్ష్యం: టీఎస్ ఐఐసీ చైర్మ‌న్ గ్యాద‌రి బాల‌మ‌ల్లు

తెలంగాణ వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌కు పూర్వ వైభ‌వ‌మే సీఎం కేసీఆర్‌, కేటీఆర్ ల‌క్ష్యం: టీఎస్ ఐఐసీ చైర్మ‌న్ గ్యాద‌రి బాల‌మ‌ల్లు

సూర‌త్‌, షోలాపూర్ వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌ల య‌జ‌మానుల కోసం..

ప్ర‌త్యేకంగా 50-100 ఎక‌రాల్లో చిన్న‌త‌ర‌హా టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు

ప‌క్క‌నే ఇళ్ల స్థ‌లాల కేటాయింపు..

వ‌ల‌స వెళ్లిన వారు సొంత రాష్ట్రానికి తిరిగి రావాలి

అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో కాక‌తీయ మెగా టెక్స్‌టైల్ పార్కు

టీఎస్ ఐఐసీ చైర్మ‌న్ గ్యాద‌రి బాల‌మ‌ల్లు వెల్ల‌డి

షోలాపూర్, భీవండి వ‌స్త్ర ప‌రిశ్ర‌మ య‌జ‌మానుల‌తో స‌మావేశం

హైద‌రాబాద్ – ఫిబ్ర‌వ‌రి 2: రాష్ట్రంలో వ‌స్త్ర ప‌రిశ్ర‌మ అభివ్ర‌ద్ధికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నందున ఇత‌ర రాష్ట్రాల‌కు వ‌ల‌స వెళ్లిన తెలంగాణ వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌ల య‌జ‌మానులు సొంత రాష్ట్రానికి తిరిగి రావాల‌ని టీఎస్ ఐఐసీ చైర్మ‌న్ గ్యాద‌రి బాల‌మ‌ల్లు పిలుపునిచ్చారు. సూర‌త్‌, షోలాపూర్‌, భీవండి నుండి వెన‌క్కి వ‌చ్చి సొంత రాష్ట్రంలో యూనిట్ల‌ను ఏర్పాటు చేసుకునే వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌ల య‌జ‌మానుల కోసం ప్ర‌త్యేకంగా వ‌స్త్ర ప‌రిశ్ర‌మ క్ల‌స్ట‌ర్ల‌ను నెల‌కొల్పుతామ‌ని చెప్పారు. స్థ‌లాల‌తో పాటు వీరికి స‌బ్సిడీలు, ప్రొత్స‌హాకాల‌ను ప్ర‌భుత్వం నుండి అందేలా చూస్తాన‌ని, ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని బాల‌మ‌ల్లు సూచించారు.  శుక్ర‌వారం బ‌షీర్‌బాగ్ ప‌రిశ్ర‌మ భ‌వ‌న్‌లోని టీఎస్ ఐఐసీ బోర్డు రూమ్‌లో తెలంగాణ నుండి వ‌ల‌స‌వెళ్లిన షోలాపూర్, భీవండి చేనేత ప‌రిశ్ర‌మ‌ల య‌జ‌మానుల‌తో టీఎస్ ఐఐసీ చైర్మ‌న్ బాల‌మ‌ల్లు స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో టీఎస్ ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, చేనేత‌శాఖ అద‌న‌పు సంచాల‌కులు శ్రీనివాస్‌రెడ్డి, జ‌హీరాబాద్ నిమ్జ్ సీఈవో మ‌ధుసూద‌న్‌, వ‌రంగ‌ల్‌జిల్లా మ‌డొకిండ టెక్స్‌టైల్ పార్కు య‌జ‌మానుల సంఘం అధ్య‌క్షుడు డీ స్వామి, షోలాపూర్ వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌ల య‌జ‌మానులు పాల్గొన్నారు. షోలాపూర్ వస్త్ర ప‌రిశ్ర‌మ‌ల య‌జ‌మానులు టీఎస్ ఐఐసీ చైర్మ‌న్ ను క‌లిసి సొంత రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేసుకోవ‌డానికి స్థ‌లాల‌ను కేటాయించాల‌ని కోరగా, అధికారుల‌తో ఆయ‌న స‌మావేశం ఏర్పాటు చేయించారు. ఈ సంద‌ర్భంగా టీఎస్ ఐఐసీ చైర్మ‌న్ బాల‌మ‌ల్లు మాట్లాడుతూ.. స‌మైక్య రాష్ట్రంలో తెలంగాణ‌లో గ‌త పాల‌కుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల వస్త్ర ప‌రిశ్ర‌మ సంక్షోభంలో కూరుకుపోయింద‌ని, వ‌రంగ‌ల్‌లోని ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఆజాంజాహి మిల్లు మూసివేతే ఇందుకు సాక్ష్య‌మ‌న్నారు. వ‌స్త్ర ప‌రిశ్ర‌మాభివ్ర‌ద్ధిని ప‌ట్టించుకోనందునే తెలంగాణ‌కు చెందిన వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌ల య‌జ‌మానులు జీవ‌నోపాధి కోసం సూర‌త్‌, షోలాపూర్‌, భీవండి, త‌దిత‌ర ప్రాంతాల‌కు వ‌ల‌సబాట ప‌ట్టార‌ని గుర్తుచేశారు. గ‌తానుభ‌వాల ద్ర‌ష్ట్యా..తెలంగాణ రాష్ట్రంలో వస్త్ర ప‌రిశ్ర‌మ‌కు పూర్వ వైభ‌వం తీసుకువ‌చ్చే్ందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ , ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ మంత్రి కేటీఆర్ క్ర‌షి చేస్తున్నార‌ని చెప్పారు.  ఇందులో భాగంగానే నిజాం కాలంలో ఒక వెలుగు వెలిగిన ఆజాం జాహి మిల్లును మించిన విధంగా వ‌రంగ‌ల్‌లో కాక‌తీయ మెగా టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేస్తున్నార‌ని  తెలిపారు. తొలిద‌శ‌లో 1200 ఎక‌రాల్లో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో  ఏర్పాటు చేస్తున్న మెగా టెక్స్‌టైల్ పార్కులో నూలిపోగు నుంచి రెడిమేడ్ వ‌స్త్రాల దాకా ఉత్ప‌త్తి చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. వ‌స్త్ర ప‌రిశ్ర‌మ అభివ్ర‌ద్ధి,  ఈ రంగంలో పెట్టుబ‌డుల‌ను ద్ర‌ష్టిలో ఉంచుకొని  టెక్స్‌టైల్ పార్కు విస్త‌ర‌ణకు మ‌రో వెయ్యి ఎక‌రాల‌ను సేక‌రించాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించార‌ని టీఎస్ ఐఐసీ చైర్మ‌న్ వెల్ల‌డించారు. సొంత రాష్ట్రానికి రండి.. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం సిద్ధించ‌డంతో నైపుణ్య‌త క‌లిగిన వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌ల య‌జ‌మానులు, కార్మికులు వేరే రాష్ట్రాలకు మేలు చేసేక‌న్నా తిరిగి సొంత రాష్ట్రానికి తిరిగిరావాల‌న్న‌దీ ముఖ్య‌మంత్రి లక్ష్య‌మ‌న్నారు. దీన్ని ద్ర‌ష్టిలో ఉంచుకొని ఇత‌ర రాష్ట్రాల‌కు వ‌ల‌స‌వెళ్లిన వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌ల య‌జ‌మానులు త‌మ సొంత రాష్ట్రానికి తిరిగి వ‌చ్చి ఇక్క‌డే ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు. తెలంగాణ‌లో యూనిట్ల‌ను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వ‌చ్చిన సూర‌త్‌, షోలాపూర్‌, భీవండి వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌ల య‌జ‌మానుల కోసం ప్ర‌త్యేకంగా 100 ఎక‌రాల్లో టెక్స్‌టైల్ పార్కులు లేదా క్ల‌స్ట‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు బాల‌మ‌ల్లు తెలిపారు.

షోలాపూర్‌లో తెలంగాణ వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌ల య‌జ‌మానులు సొంత రాష్ట్రానికి వెన‌క్కి వ‌చ్చి ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేసుకునేందుకు సంసిద్ధంగా ఉన్నందున వారు స‌మ్మ‌తిస్తే వ‌ర‌గంల్  కాక‌తీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో 50-100 ఎక‌రాల‌ను కేటాయిస్తామ‌న్నారు. అలాగే  జ‌న‌గామ జిల్లా చిన్న పెండ్యాల గ్రామంలోనూ  చిన్న‌త‌ర‌హా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు ప‌రిశీల‌న‌లో ఉంద‌న్నారు. ఇక్క‌డ 140 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి అందుబాటులో ఉండ‌గా,  ఇందులో 40 ఎక‌రాలు టీఎస్ ఐఐసీ ఆధీనంలో ఉంద‌ని చెప్పారు. ఇత‌ర రాష్ట్రాల నుంచి సొంత రాష్ట్రంలో యూనిట్ల‌ను ప‌రిశ్ర‌మ‌ల‌ను నెల‌కొల్ప‌డానికి ముందుకువ‌చ్చే వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌ల య‌జ‌మానుల‌కు స్థ‌లాల‌తో పాటు  టెక్స్‌టైల్ పార్కు ప‌క్క‌నే ఇళ్ల స్థ‌లాల‌ను కూడా ఇవ్వ‌నున్న‌ట్లు టీఎస్ ఐఐసీ చైర్మ‌న్ వెల్ల‌డించారు. ఈ అవ‌కాశాన్ని ఇత‌ర రాష్ట్రాల్లోని తెలుగు వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌ల య‌జ‌మానులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. షోలాపూర్‌లో తెలంగాణ వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌ల య‌జ‌మానులు దుప్ప‌ట్లు త‌యారు చేస్తున్నార‌ని, ఈ ప‌రిశ్ర‌మ‌ల్లో నాలుగు ల‌క్ష‌ల మంది కార్మికులు మ‌న‌వాళ్లే ప‌నిచేస్తున్నార‌ని చెప్పారు. తెలంగాణ ప్ర‌భుత్వం వ‌స్త్ర ప‌రిశ్ర‌మాభివ్ర‌ద్ధికి అధిక ప్రాధాన్య‌తనిచ్చి ఈ రంగంలోని పారిశ్రామిక‌వేత్త‌ల‌ను ప్రొత్స‌హించేందుకు భారీ ఎత్తున టెక్స్‌టైల్ పార్కును, చిన్న‌త‌ర‌హా టెక్స్‌టైల్ క్ల‌స్ట‌ర్ల ఏర్పాటు చేస్తోంద‌న్నారు. ఈ అవ‌కాశాన్నిఉప‌యోగించుకొని ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేసుకునేందుకు షోలాపూర్‌లోని తెలంగాణ వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌ల య‌జ‌మానులు కొంద‌రు ముందుకు వ‌చ్చార‌ని గుర్తు చేశారు. మిగతా య‌జ‌మానులు, వ‌స్త్ర కార్మికులంద‌రూ సొంత రాష్ట్రానికి తిరిగి వ‌చ్చి ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేసుకునేలా షోలాపూర్ తెలంగాణ వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌ల య‌జ‌మానుల సంఘం నాయ‌కులు చొర‌వ తీసుకోవాల‌ని టీఎస్ ఐఐసీ చైర్మ‌న్ బాల‌మ‌ల్లు సూచించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *