తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప‌థ‌కాలు సూప‌ర్‌: వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప‌థ‌కాలు సూప‌ర్‌: వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి

కెసిఆర్ కిట్ల ప‌థ‌కం వెరీ వెరీ స్పెష‌ల్‌

కేంద్రానికి రాష్ట్రం త‌ర‌పున ప‌లు ప్ర‌తిపాద‌న‌లు

సిద్దిపేట‌, సూర్యాపేట‌, న‌ల్ల‌గొండ వైద్య క‌ళాశాల‌ల‌కు మ‌రిన్ని నిధులు

సీట్ల పెంపుతో వైద్య విద్య‌, ప‌రిశోధ‌న‌ల‌కు త‌గిన‌ ప్రోత్సాహం

కొత్తగా మ‌రికొన్ని మాతా శిశు, న‌వ‌జాత శిశు, ఐసియు, డ‌యాల‌సిస్, క్యాన్స‌ర్‌, వ్యాధి నిర్ధార‌ణ కేంద్రాలు

వెల్ నెస్‌, బ‌స్తీ ద‌వాఖానాల‌కు వెన్నుద‌న్ను

ఆవ‌య‌వ మార్పిడుల‌కు మ‌రిన్ని అవ‌కాశాలు

నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్ ల‌కు పిఎం స్వాస్త్య స‌మృద్ధి యోజ‌నం

వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డితో స‌మావేశ‌మైన కేంద్ర ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి ప్రీతి సూడాన్‌

హైద‌రాబాద్: కొత్త రాష్ట్ర‌మైన‌ప్ప‌టికీ తెలంగాణలో అమ‌లు చేస్తున్న‌ వైద్య ఆరోగ్య శాఖ ప‌థ‌కాలు సూప‌ర్‌! అందులో కెసిఆర్ కిట్ల ప‌థ‌కం వెరీ వెరీ స్పెష‌ల్‌!!… రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలే కాదు. కేంద్ర ప్ర‌భుత్వ అధీనంలోన ప‌థ‌కాల‌ను కూడా అద్భుతంగా అమ‌లు చేస్తున్నారు. నేను చేసిన క్షేత్ర ప‌రిశీల‌న‌లో ఇంకా అనేక మంచి విష‌యాలు గ్ర‌హించాను. కీప్ ఇట్ ఆప్‌… అంటూ తెలంగాణ ప్ర‌భుత్వాన్ని అభినందించారు కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి ప్రీతి సూడాన్‌. కేంద్రం నుంచి ఎయిమ్స్ స‌హా మ‌రిన్ని నిధులు ఇవ్వ‌డానికి, త‌గిన ప్రోత్సాహం అందించ‌డానికి ఆమె సానుకూలంగా స్పందించారు. స‌చివాల‌యంలోని ఆయ‌న చాంబ‌ర్‌లో మంత్రి ల‌క్ష్మారెడ్డిని ఆమె మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో అమ‌లు అవుతున్న అనేక వైద్య ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ ప‌థ‌కాల‌ను మంత్రితో ఆమె స‌మీక్షించారు. అలాగే వైద్య మంత్రి రాష్ట్రం త‌ర‌పున కేంద్రానికి ప‌లు ప్ర‌తిపాద‌న‌లు చేశారు. ఎయిమ్స్ రాష్ట్రానికి ఇవ్వ‌డానికి అధికారికంగా ఎలాంటి స‌మ‌స్య‌లు లేవ‌న్నారు. అయితే ఈ విష‌యం కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంలో ఉన్నందున రాజ‌కీయ నిర్ణ‌యం జ‌ర‌గాల్సి ఉంద‌ని వివ‌రించారు. నూత‌నంగా ఏర్పాటు చేస్తున్న సిద్దిపేట‌, సూర్యాపేట‌, న‌ల్ల‌గొండ వైద్య క‌ళాశాల‌ల‌కు మ‌రిన్ని నిధులు ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తామ‌న్నారు. మ‌రోవైపు ఆయా కాలేజీల్లో నేష‌న‌ల్ పూల్ కింద యూజీ, పీజీ సీట్ల పెంపు, వైద్య విద్య అభివృద్ధి, ప‌రిశోధ‌న‌ల‌కు త‌గిన‌ ప్రోత్సాహం కూడా అందిస్తామ‌న్నారు. స్పె షాలిటీ సీట్ల అవ‌స‌రం కూడా ఉంద‌ని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఇప్ప‌టికే ప్రారంభించిన మాతా శిశు వైద్య‌శాల‌ల‌ను ప‌రిశీలించిన ఆమె మ‌రికొన్ని మాతాశిశు హాస్పిట‌ల్స్‌ని ఇస్తామ‌న్నారు. అలాగే ఈ మ‌ధ్యే న‌వ‌జాత శిశు సంర‌క్ష‌ణ‌లో దేశంలోనే తెలంగాణ‌కు ఉత్త‌మ అవార్డు ద‌క్క‌డం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేస్తూనే, కొత్తగా మ‌రికొన్ని న‌వ‌జాత శిశు, ఐసియు, డ‌యాల‌సిస్, క్యాన్స‌ర్‌, వ్యాధి నిర్ధార‌ణ కేంద్రాలకు అవ‌స‌ర‌మైన నిధుల విష‌యం ప‌రిశీలిస్తామ‌న్నారు. తెలంగాణ‌లో అవ‌యవ మార్పిడులు విజ‌య‌వంతంగా ప్ర‌భుత్వ రంగంలోనూ జ‌రుగుతున్న విష‌యాన్ని మంత్రి ఆమె దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చి, ఇక్క‌డ ఆవ‌య‌వ మార్పిడిలు చేసుకుంటున్న విష‌యం మంత్రి ఆమెకు తెలిపారు. ఇక ఈ మ‌ధ్యే ప్రారంభించిన వెల్ నెస్ కేంద్రాల నిర్వ‌హ‌ణ తీరు తెన్నుల‌ను ఆమె అడిగి తెలుసుకున్నారు.  అయితే మ‌రిన్ని ప్రోత్సాహ‌కాలు అవ‌స‌రం ఉంద‌ని మంత్రి ఆమె చెప్పారు. ఆధునాత‌న ఆప‌రేష‌న్ థియేట‌ర్లు, ఇత‌ర ప‌రిక‌రాలు, స‌దుపాయాల కోసం కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌పున త‌గిన ప్రోత్సాహం అందే విధంగా చూడాల‌ని మంత్రి కేంద్ర కార్య‌ద‌ర్శి సూడాన్‌కి చెప్పారు.

laxma reddy 2

సెంట్ర‌ల్ హెల్త్ స్కీంకి మించి ఉచితంగా అందిస్తున్న మందులు ఇత‌ర వివ‌రాల‌ను ఆమె విన్నారు. అలాగే ఈమ‌ధ్యే హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలోని ప్ర‌జ‌ల‌కు స‌ర్కార్ వైద్య సేవ‌లు అందుబాటులోకి తేవ‌డానికి చేప‌ట్టిన బ‌స్తీ ద‌వాఖానాల‌కు వెన్నుద‌న్నుగా నిలుస్తామ‌ని చెప్పారు. నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్ ల‌కు పిఎం స్వాస్త్య స‌మృద్ధి యోజ‌న ప‌థ‌కం కింద మ‌రింత సాయంగా నిలుస్తామ‌ని ఆమె చెప్పారు.  రెండో ఎఎన్ఎంలకు క‌నీస‌ వేత‌నాలు ఆశా వ‌ర్క‌ర్ల‌కు ప్రోత్సాహ‌కాలు పెంచాలి రెండో ఎఎన్ఎంల‌కు క‌నీస వేత‌నాలు పెంచాల‌ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండో ఎఎన్ఎంలు త‌క్కువ జీతాల‌తో రెగ్యుల‌ర్ ఎఎన్ఎంల విధులు నిర్వ‌ర్తిస్తున్నార‌ని, జీతాలు పెంచాల‌ని వారి నుంచి ఉన్న డిమాండ్‌ని మంత్రి కేంద్ర కార్య‌ద‌ర్శి సూడాన్ దృష్టికి తెచ్చారు. అలాగే అశా వ‌ర్క‌ర్ల‌కు తెలంగాణ‌ రాష్ట్రంలో నెల‌కు క‌నీసం రూ.6వేలు వ‌చ్చే విధంగా ప్రోత్సాహ‌కాలు అందిస్తున్న విష‌యం ఆమె తెలిపారు. నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ కింద కేంద్రం-రాష్ట్రం ఉమ్మ‌డిగా వేత‌నాలు చెల్లిస్తున్నందున కేంద్రం వేత‌నాల పెంపున‌కు సానుకూలంగా లేక‌పోవ‌డంతో, భార‌మైన‌ప్ప‌టికీ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆశాలకు క‌నీస ప్రోత్సాహాన్ని ప్ర‌క‌టించి ఇస్తున్నామ‌ని మంత్రి ఆమెకు వివ‌రించారు. కేంద్రం చొర‌వ తీసుకుంటే వాళ్ళ‌కి వేత‌నాలు పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని తెలిపారు. కెసిఆర్ కిట్ల‌కు పిఎంఎంవైపి నిధులు కోరిన మంత్రి కెసిఆర్ కిట్ల ప‌థ‌కానికి కేంద్ర స్థాయిలో అమ‌లు అవుతున్న ప్ర‌ధాన మంత్రి మాతృత్వ యోజ‌న ప‌థ‌కం కింద నిధులు అందిస్తే ఆ ప‌థ‌కాన్ని మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేయ‌డానికి వీల‌వుతుంద‌ని మంత్రి ల‌క్ష్మారెడ్డి కేంద్ర కార్య‌ద‌ర్శి ప్రీతి సూడాన్‌కి ప్ర‌తిపాదించారు. అలాగే వెల్ నెస్ సెంట‌ర్ల‌కు ఆయుష్ సేవ‌లు కూడా అందే విధంగా కేంద్రం చొర‌వ తీసుకోవాల‌ని మంత్రి కోరారు.  చ‌ట్టాల ప‌టిష్టానికి ప్ర‌తిపాద‌న‌లు క్లీనిక‌ల్ ట్ర‌య‌ల్స్‌కి జాతీయ స్థాయిలో ఒకే నిబంధ‌న‌లుండేలా చూడాల‌ని, క్లీనిక‌ల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ కింద జాతీయ స్థాయిలో దేశ వ్యాప్తంగా ఒకే రేట్లు, హాస్పిట‌ల్స్ గ్రేడింగ్స్‌, క్లీనిక‌ల్ కేర్ స్థాయిల‌ను నిర్ణ‌యిస్తే బాగుంటుంద‌ని కూడా మంత్రి చెప్పారు.   క‌ల్తీ నివార‌ణ‌కు మ‌రిన్ని వాహ‌నాలు ఇక క‌ల్తీ నివార‌ణ‌కు కొత్త ల్యాబ్స్‌, మ‌రికొన్ని మోబైల్ ఫుడ్ సేఫ్టీ అండ్ చెకింగ్ వాహ‌నాల‌ను అందించాల‌ని మంత్రి కోరారు. ఇచ్చిక ఒక వాహ‌నాన్ని నిన్న‌నే ప్రారంభించామ‌ని తెలిపారు. అయితే క‌నీసం జిల్లా కు ఒక వాహ‌నం చొప్పున ఉంటే మ‌రింత ప‌టిష్టంగా క‌ల్తీ నివార‌ణ చేయ‌డం వీల‌వుతుంద‌ని మంత్రి ఆమెకు తెలిపారు. ఈ స‌మ‌స్య‌ల‌న్నీ విన్న కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి ప్రీతి సూడాన్ త‌మ ప‌రిధిలోని స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఆయా స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రానికి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు.

ఈ స‌మావేశంలో రాష్ట్ర‌ వైద్య ఆరోగ్య‌శాఖ‌ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శాంతి కుమారి, కుటుంబ సంక్షేమ‌శాఖ క‌మిష‌న‌ర్ వాకాటి కరుణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

laxma reddy 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *