
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కవిత పిలుపునకు స్పందించారు.. సానియా మీర్జా రైతులకు రూ.3 లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఓజా, జ్వాలా లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నట్టు ప్రకటించారు.
దీంతో పాటు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ముంబై, లండన్ తదితర విదేశాల్లోని తెలంగాణ ప్రవాసీయులు కూడా రైతులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు.