
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘము జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా సభ సక్సెస్ అయ్యింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ, ఐ జె యూ కార్య వర్గ సభ్యులు దాసరి కృష్ణా రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొంతు రమేష్, తెలంగాణ ఆన్లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అయిలు రమేష్, యూనియన్ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర కార్య వర్గ సభ్యులు రాజేష్, వెంకట రమణ, విద్యా సాగర్, గడిపెల్లి మధు, సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.