Breaking News

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జనగామ జిల్లా ప్రథమ మహాసభ విజయవంతం

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం  జనగామ జిల్లా ప్రథమ మహాసభ ఇవ్వాళ విజయవంతం

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం  జనగామ జిల్లా ప్రథమ మహాసభ శనివారం విజయవంతంగా జరిగింది. జిల్లాలో సుమారు 350 మంది జర్నలిస్టులు పనిచేస్తుండగా, ఈ సభకు 240 మంది తరలిరావడం విశేషం. ఈ జిల్లా పరిధిలో ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్ ఘనపూర్ , పాలకుర్తి, జనగామ ఎమ్యెల్యేలు డాక్టర్ రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్ రావు, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ పద్మ, టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, ఉపాధ్యక్షులు దొంతు రమేష్, ఐజేయూ నాయకులు దాసరి కృష్ణారెడ్డి, టీయుడబ్ల్యుజె రాష్ట్ర నాయకులు రాజేష్, విద్యాసాగర్, మధు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు తుమ్మ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జనగామ జిల్లాలోని 13 మండలాల్లో పనిచేస్తున్న 350 మంది జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం పట్టణంలోని 140 సర్వే నెంబరులో గల 15 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వానికి అందించనున్న సిఫారసు పత్రాన్ని ఇవ్వాళ జనగామ జిల్లా తీయుడబ్ల్యుజె మహాసభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ కి అందిస్తున్న అసైన్మెంట్ కమిటీ చైర్మన్, జనగామ ఎమ్యెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. చిత్రంలో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య, వరంగల్ జెడ్ పి చైర్ పర్సన్ పద్మ తదితరులు.

1 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *