
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ-IJU) కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రథమ మహాసభ ఇవ్వాళ విజయవంతంగా జరిగింది . ఈ జిల్లాలో కేవలం రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు , 13 మండలాలు మాత్రమే ఉన్నప్పటికీ దాదాపు 150 మంది జర్నలిస్టులు ఈ సభకు తరలిరావడం విశేషం . జిల్లాకలెక్టర్ చంపాలాల్ , టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ , రాష్ట్ర ఉపాధ్యక్షులు కరుణాకర్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేష్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అద్యక్షులు ప్రకాష్ రెడ్డి , జిల్లా సీనియర్ నాయకులు చంద్రశేఖర్ , ఆసిఫాబాద్ జిల్లా కన్వీనర్ అబ్దుల్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు,