తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 1,30,415 కోట్లు

1,30,415 కోట్లతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ లో పక్కా సంక్షేమ, ఆర్థిక, వ్యవసాయ, పారిశ్రామిక, విద్యా, పోలీస్ శాఖ ఇలా అన్ని రంగాలకు పెద్దపీట వేశారు. ప్రణాళిక వ్యయం కింద 67,630 కోట్లను , ప్రణాళికేతర వ్యయం 62,785 కోట్లను ప్రతిపాదించారు. రెవెన్యూ మిగులు ను 3318 కోట్లను చూపించారు.

వివిధ పథకాలకు కేటాయింపులు ఇవీ..
– నీటి పారుదల రంగానికి – 25వేల కోట్లు
-మిషన్ భగీరథ పథకానికి- 36, 976 కోట్లు
-గ్రామీణాభివృద్దికి – 10731 కోట్లు
– పాలమూరు ఎత్తిపోతల పథకానికి – 7861 కోట్లు
-బీసీ సంక్షేమానికి -2538
-మైనార్టీ సంక్షేమానికి -1204 కోట్లు
– ఎస్సీ సంక్షేమానికి – 7122 కోట్లు
-ఆరోగ్య శాఖకు – 5967 కోట్లు
– వ్యవసాయంకు -6759 కోట్లు

విద్యాశాఖ ప్రణాళికేతర వ్యయానికి రూ. 9044 కోట్లు కేటాయించారు. విద్యాశాఖలో ప్రణాళిక వ్యయానికి రూ.1164 కోట్లను ప్రతిపాదించారు.
కాగా వచ్చే ఖరీఫ్ నుంచి వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ అందించనున్నట్లు మంత్రి ఈటెల బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *