
కరీంనగర్: జూన్ 2 తెలంగాణ రాష్ట్ర్ర అవతరణ దినోత్సవ వేడుకలను అన్ని జిల్లాలలో ఘనంగా నిర్వహిచాలని రాఫ్ట్ర్ర గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతిక శాఖామాత్యులు చందూలాల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర్ర అవతరణ దినోత్స వేడుకల నిర్వహణ పై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూన్ 2 రాష్ట్ర్ర అవతరణ దినోత్సవం సందర్భంగా
ఉదయం 8.00 గంటలకు అన్ని జిల్లాలలో అమర వీరుల స్ధూపానికి సంబంధిత మంత్రులు, జిల్లా అధికారులు నివాళులర్పించాలని అన్నారు. అనంతరం జాతీయ పతాకావిష్కరణ గావించాలని సూచించారు. రాష్ట్ర్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గ్రామ స్ధాయి నుండి జిల్లా స్ధాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్ధలలో జాతీయ పతాకావిష్కరణ చేయాలని సూచించారు. అవతరణ దినోత్సవం సందర్భంగా అన్ని వసతి గృహలలో, వికలాంగుల పాఠశాలలో, అనాధ శరణాలయాలలో, బాలసదనాలలో, అందుల పాఠశాలలో పండ్లు, స్వీట్లు పంపిణి చేయాలని ఆదేశించారు. వికలాంగులకు ఉపకరణాలు అందించాలని అన్నారు.
సాయంత్రం గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్ధాయిలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబర్చిన 25 మందిని గుర్తించి 51,116 రూపాయల నగదు అవార్డు అందించి సన్మానించాలని సూచించారు. అవతరణ దినోత్సవ వేడుకలలో ప్రజలందరిని భాగస్వాములను చేసి పండుగ వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుండి సాంస్కృతిక శాఖ రాష్ట్ర్ర ప్రభుత్వ సలహదారు రమణాచారి, ప్రిన్సిపల్ సెక్రటరి వెంకటేశం, ముఖ్యమంత్రి కార్యాలయం ఓ.ఎస్.డి. దేశాపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కరీంనగర్ నుండి అదనపు జెసి డా. ఎ. నాగేంద్ర, జిల్లా రెవెన్యూ అధికారి టి. వీరబ్రహ్మయ్య, సమాచార శాఖ ఉప సంచాలకులు బి.రాజమౌళి, జిల్లా పౌర సంబంధాల అధికారి డివిజెఎవి ప్రసాద్, జిల్లా టూరిజం అధికారి వెంకటేశ్వర్లు, డివిజనల్ పౌర సంబంధాల అధికారి సిరిసిల్ల కనకయ్య తదితరులు పాల్గొన్నారు.