తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పరిశ్రమ..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పరిశ్రమ రానుంది. ఇప్పటికే దేశ,విదేశాలోని పలు ప్రఖ్యాత సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకై ఆసక్తి చూపుతుండగా తాజాగా దేశంలోని ప్రఖ్యాత వ్యవసాయ యంత్ర పరికరాల తయారి సంస్థ శక్తిమాన్ కంపెని తమ ప్లాంట్ ను తెలంగాణ లో నెలకొల్పాలని నిర్ణయించింది.
ఈరోజు హైదరాబాద్ జీడిమెట్ల లోని సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సి (COE)లో శక్తి మాన్ కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గుజరాత్ కు చెందిన శక్తిమాన్ కంపెని వ్యవసాయ యంత్ర పరికరాల తయారిలో ఎంతో పేరు గడించిందని ఉత్తర భారత దేశంలో వ్యవసాయ యంత్ర పరికరాల ఉత్పత్తిలో ముందంజలో ఉందన్నారు. తెలంగాణలో తయారి యూనిట్ ని నెలకొల్పడం ద్వారా దక్షిణ భారత దేశంలోని రైతులకు నాణ్యమైన యంత్ర పరికరాలు తక్కువ ధరలలో అందుబాటులోకి వస్తాయని ప్రతినిధులు తెలిపారు. ప్లాంటు నిర్మాణం కోసం రూ 500 కోట్లు పెట్టుబడిగా పెడతామని మొత్తం 1000 మందికి ఉపాది కలుగుతుందని తెలిపారు. భూమి ఇతర వసతులు కల్పిస్తే త్వరగా నిర్మాణ పనులను ప్రారంభించడానికి సిద్దంగా ఉన్నామన్నారు.
మంత్రి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అత్యంత అనుకూలమైనదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గారు పారిశ్రామిక రంగానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నారని, టిఎస్ పాస్ ద్వారా ఇప్పటికే వేల సంస్థలు తెలంగాణలో తమ ప్లాంట్లను నెలకొల్పాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యంత్రీకరణ కోసం దేశంలోనే ఏ రాష్ట్రం కూడా ఇవ్వనన్ని సబ్సిడీలను ఇస్తు ప్రోత్సహిస్తున్నామని, తద్వారా రైతులకు కూలీల కొరతతో పాటు సేద్యం ఖర్చులు తగ్గి లాభాలను అర్జిస్తున్నారని తెలిపారు. రైతులకు మేలు చెసే ఏ అంశంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ, సహకారాలను అందిస్తుందని, ప్లాంటు ఏర్పాటుకు కావలసిన అన్ని అనుమతులను త్వరితంగా ఇప్పించే ఏర్పాట్లు చేస్తానని హామి ఇచ్చారు. . వెంటనే పరిశ్రమల శాఖ యండి నర్సింహారెడ్డి గారితో ఫోన్ లో మాట్లాడిన మంత్రి గారు శక్తిమాన్ కంపెని ప్రతిపాధనలను పరిశీలించి అవసరమైన అనుమతులు, వసతులను కల్పించాల్సిందిగా సూచించారు.
ఈసమావేశంలో ఉద్యాన శాఖ కమీషనర్ యల్ వెంకట్రామిరెడ్డి, శక్తిమాన్ కంపెని నేషనల్ హెడ్ రవి మాథుర్, HR హెడ్ గుణాకర్ రావు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *