
తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ గారి నాయకత్వంలో దూసుకుపోతుంది అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇది మనం చెప్పుకోవడం కాదు అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జెట్లీ పార్లమెంట్ వేదికగా చెప్పారని మంత్రి అన్నారు. రాష్ట్రం పురోగమిస్తుంది అన్నారు. ఉద్యమ సమయం లో ఏ విధంగా పనిచేశామో అదే ఉద్యమ స్పూర్తితో కమిట్మెంట్ తో, కన్వెక్షన్ తో పని చేస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయి అనడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కెసిఆర్ గారు గొప్ప ఉదాహరణ అని అయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వ విధానాలతో పాటు, మౌలికవసతులు కూడా అవసరం అని వాటిని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది అన్నారు. ఉత్పత్తులు పెరగటానికి 24 గంటల విద్యుత్ ప్రధాన భూమిక అని, పరిశ్రమలు 24 గంటలు పనిచేస్తున్నాయని.. దీంతో పారిశ్రామిక వేత్తలు అందులో పనిచేస్తున్న కార్మికులు కూడా సంతోషంగా ఉన్నారని మంత్రి అన్నారు. కరెంట్ వినియోగంలో దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్నామన్నారు. దేశ జీడీపీ కంటే 4 % అధికంగా ఉన్నామన్నారు. స్టేట్ ఔన్డ్ టాక్స్ గ్రోత్ 21.9% ఉండగా , యావరేజ్ గా 17.8% గ్రోత్తో దేశం లోనే నెంబర్ వన్ గా నిలిచి తెలంగాణ సత్తాచాటామని అన్నారు. ప్రపంచం గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుతుంటే మనం హరితహారం తో పరిష్కారం చూపిస్తున్నాం. జీవితం, జీవం గురించి పట్టించుకుంటున్న రాష్ట్రం మనది అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రోడ్ల నిర్మాణం, ప్రశాంత వాతావరణం కల్పిస్తున్న శాంతిభద్రతలు , ప్రభుత్వం పట్ల ప్రజలకు విశ్వాసం కల్పించడం ఇవన్నీ తెలంగాణ అభివృద్ధికి కారణం అని అన్నారు. 2 సంవత్సరాల లోపే భారీ నీటిపారుదల ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్న ఘనతకూడా మనదే అన్నారు. దేశంలో ఎగుమతుల్లో 70% వాటా సాధించిన 5 రాష్ట్రాల్లో మనం ఉండడం గర్వకారణం అని అన్నారు. రాష్ట్రము ఏర్పడప్పటికీ ఇప్పటికి మన పట్ల ఢిల్లీ వైఖరి మారిందని మొదట్లో పట్టించుకోని వారు ఇప్పుడు గౌరవిస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. మన విధానాల వల్ల దేశంలో అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో ఇంకా మెరుగైన ఫలితాలు అందించేందుకు కెసిఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తామని మంత్రి ఈటల అన్నారు.