
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 30 వేల మంది ఉపాధ్యాయుల నియమకం
అజ్ఞానమనే చీకటిలో ఉన్న వారిని విజ్ఞానమననే మార్గంలో నడిపించే ఏకైక గురువు ఉపాధ్యాయుడు
రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలి
విద్యా, వైద్యం పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
తెలంగాణ రాకపూర్వం 9 గురుకులాలు ఉంటే నేడు 300 గురుకులాలు
5జీ డిజిటల్ తరగతుల నిర్వహణ దిశగా చర్యలు
రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
. –+++++
భారతదేశ భవిష్యత్తు తరగతిగది నుంచే మారాలని సూచించిన గొప్ప వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని రాష్ట్ర బీసీ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు 2022 సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాల కార్యక్రమంలో రాష్ట్ర బీసీ క్షేమ, పౌర సరఫరాల శాఖా మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అజ్ఞానమనే చీకట్లో ఉన్నవారిని విజ్ఞానమనే మార్గంలో నడిపించే ఏకైక గురువు ఉపాధ్యాయుడు అన్నారు. భారతదేశ భవిష్యత్తు తరగతి గది నుంచి మారాలని సూచించిన గొప్ప వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అని, వారి జన్మదినాన్ని ప్రతి ఏటా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము అన్నారు . రేపటి దేశ భవిషత్కు రూపకల్పన చేస్తున్న ఉపాధ్యాయుల కోసం ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించాలని కోరారని దేశ భవిష్యత్తు ఎక్కడి నుండో కాదు తరగతి గది నుండే తయారవుతుందని, అంతటి పవిత్ర వృత్తి ఉపాధ్యాయవృత్తిని అన్నారు. అభివృద్ధి చెందిన అమెరికా, జర్మనీ లాంటి దేశాలలో ఉన్నతస్థానాలలో ఉన్నవారిని ఒకే రకంగా చూస్తారని ఒక్క రైతులను, టీచర్లకు మాత్రమే గౌరవిస్తారని పేర్కొన్నారు. భవిషత్తు తరాలకు ఆస్తులను కాకుండా అంతకు విలువైన విద్యను అందించినప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు తమ మేధోశక్తిని, విజ్ఞానాన్ని వినియోగించి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి మనకు 9 గురుకులాలు మాత్రమే ఉండేవని, తెలంగాణ రాష్ట్రo వచ్చిన తరువాత వాటిని దాదాపు 300 గురుకులాలుగా అభివృద్ధి చేసుకోవడం జరిగిందని1.52 లక్షల మంది విద్యార్థులు గురుకులాల్లో చదువుతున్నారని పేర్కొన్నారు. బీసీ శాఖలోనే దాపుగా 12 వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 30 వేల మంది ఉపాధ్యాయులను నియమించడం జరిగిందన్నారు.. కరీంనగర్ లో సౌత్ ఇండియాలోనే పెద్దదైన కేబుల్ బ్రిడ్జ్, మెడికల్ కాళాశాలలు, అందమైన రోడ్లు, మానేరు రివర్ ఫ్రాంట్, టిటిడి దేవస్థానం, వైద్య కళాశాల నిర్మాణాలను చేపట్టుకోవడం జరుగుతుందని తెలిపారు.
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ
జీవితంలో స్థిరపడడానికి, గొప్పగా విలువైన పాఠాలు నేర్పించేది గురువని అన్నారు. మన ఎదుగుదలకు కన్న దండ్రులు ఎంత చేస్తారో అంతకంటే ఎక్కువ గురువు చేస్తాడన్నారు. సరైన మార్గంలో నడిపించేది గురువు అని ఉపాధ్యాయుని పాత్ర చాలా గొప్పది అన్నారు.
సామాజికంగా,ఆర్థికంగా భారత తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ పార్టీ పునాది వేశారన్నారు. స్వతంత్రం తొలిరోజుల్లో నెహ్రూ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టారన్నారు. ప్రభుత్వ ప్రైవేటు రంగంలో కొత్త ఆలోచనలు తీసుకువచ్చిన మహనీయుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఒక్కొక్క సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు నీళ్లు నిధులు నియామకాలు పరిష్కారం అవుతున్నాయన్నారు. దేశంలో 24 గంటలు కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఎండాకాలంలో కూడా మత్తడి పై నుండి నీళ్లు దునుకుతున్నాయి అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలోని 44 వేల చెరువులు, కుంటలు మరమ్మతు చేయడం జరిగిందన్నారు. ముప్పై మూడు జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. ఊరు మన బడి ద్వారా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్నామన్నారు.
ఈ ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, జిల్లా పరిషత్ చైర్మన్ కనుమళ్ల విజయ, తుడా చైర్మన్ జీవి రామకృష్ణ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు, కార్పోరేటర్లు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Look new free site [url=https://bit.ly/3yGz9At]Teen Tube[/url]