
వరంగల్ అర్భన్ జిల్లా: సామాజ హితాన్ని కోరి.. సమాజిక సృహతో పుట్టిన గడ్డను, విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలలను బాగుకోసం ముందుకు వచ్చిన సంఘసంస్కర్త, ప్రముఖ వ్యాపారవేత్త కావేరి భాస్కర్ రావు దంపతులను రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటెల రాజేందర్ లు అభినందించారు.
భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ గ్రామంలో కావేరి సీడ్స్ అధినేత వనజా-భాస్కర్ రావు లు కావేరి భాస్కర్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నూతన నిర్మించిన భవనాన్ని శ్రీమాన్ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జియ్యర్ స్వామి జీ మంగళశాసనములతో కలిసి ప్రారంభించారు.
పాఠశాల భవనం ప్రారంభించడానికి ముందు వికాస మహిళా ఆరోగ్య ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
ఎర్రబెల్లి కామెంట్స్…
విద్యా, వైద్యంలో సేవలు అందకుండా బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యం కాదని గుర్తించి.. తెలంగాణ ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విధ్యను అందిస్తుంది. విద్యార్థినులకు హైజిన్ కిట్లు, కేసీఆర్ కిట్లు, కంటి వెలుగు, దంత పరీక్షలను నిర్వహిస్తుంది… మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి క్యాన్సర్ బారిన పడకుండా కాపాడేందుకు కృషి చేస్తామన్నారు.
వ్యాపారవేత్తలు తమ సంపాధనలో కనీసం 5 శాతం సామాజిక అవసరాలకు ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేశారు.