తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రకాల భూములకు సరైన లెక్కలు ఉండాలి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్నింటిలోనూ అన్ని రకాల భూములకు సరైన లెక్కలు ఉండాలని, ప్రతి అంగుళం భూమికి ఎవరు యజమాని అనేది తేల్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు.  తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన భూ రికార్డుల  ప్రక్షాళన కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో భూముల వివరాల లెక్క తేలిందని, ఇదే తరహాలో పట్టణాలు, నగర ప్రాంతాల్లో కూడా ప్రతి భూమి తేల్చాలని సీఎం కేసీఆర్ చెప్పారు . మార్చి 11వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కొత్త పాస్ పుస్తకాల పంపిణి చేపట్టాలని నిర్ణయించినందున మార్చి 5వ తేదీ నాటికే పాసుపుస్తకాలు జిల్లాలను చేరాలని, ఆ విధంగా కార్యాచరణ రూపొందించుకొని అమలు చేయాలని కేసీఆర్ చెప్పారు.  భవిష్యత్తులో భూ వివాదాలకు తావులేకుండా రికార్డులన్నీ ప్రక్షాళన చేయడంతోపాటు వాటిని పారదర్శకంగా నిర్వహించాలని కేసీఆర్ సూచించారు . సరళమైన విధంగా ఉండే పాస్ పుస్తకాలు, పహాణీల రూపకల్పన, భూ రికార్డుల ప్రక్షాళన తదనంతర కార్యక్రమాలు ధరణి నిర్వహణ తదితరాంశాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు.  ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శులు నరసింగరావు, శాంతి కుమారి , రెవెన్యూ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ల్యాండ్ రికార్డుల విభాగం డైరెక్టర్ వాకాటి కరుణ,మీసేవ కమిషనర్ వెంకటేశ్వరరావు,  రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందనరావు, మేడ్చల్ కలెక్టర్ ఎం.వి రెడ్డి, ఎమ్మెల్యే ఆలం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాస్ పుస్తకాలు, పహణిల్లో ప్రస్తుతం 31 కాలమ్స్ ఉన్నాయి. కాలక్రమేణా వచ్చిన మార్పుల కారణంగా చాలా కాలమ్స్ అవసరంలేదు, ప్రభుత్వం భూమి శిస్తు వసూలు చేసిన కాలమ్స్ అవసరం ఉండేది. మరికొన్ని కాలమ్స్ అవసరం కూడా ఇప్పుడు లేదు. ఇవన్నీ ఉండటం వల్ల అనవసర గందరగోళం ఏర్పడుతుంది. భూమి రికార్డుల కు సంబంధించిన సమగ్ర సమాచారం ధరణి ఉంటుంది .రైతుల వద్ద ఉండే పాస్‌పుస్తకాలు, పహణిల్లో అన్ని వివరాలు అవసరం లేదు. అత్యవసరం అనుకున్న వివరాలు ఉంటే చాలు. రైతు పేరు, ఖాతా నంబర్, సర్వే నంబర్ , విస్తీర్ణం, భూమి పొందిన విధానం లాంటి కొన్ని ముఖ్యమైన  కాలమ్స్ ఉంటే సరిపోతుంది. పాస్ పుస్తకాల్లో, పహాణి ల్లో పరభాషా పదాలు చాలా వాడుతున్నారు. అవేవీ మన రైతులకు అర్థంకావు కాబట్టి రైతుల వాడే పదాలను పాసుపుస్తకాలు, పహణిలో వాడాలి . ఈ మార్పులతో కొత్త పాస్‌పుస్తకాలు పహాణీలు తయారుకావాలి అని ముఖ్యమంత్రి సూచించారు. కాలమ్స్ ఉంచాలి ఈ కాలం తీసివేయాలి అనే విషయంలో విస్తృత చర్చ జరిపి నిర్ణయం తీసుకున్నారు. దానికనుగుణంగానే కొత్త పాస్‌పుస్తకాలు, పహాణీలు పంపిణీ చేయాలని, పాస్ పుస్తకం పైన కచ్చితంగా రైతు ఫోటో ఉంచాలని, ప్రతి పుస్తకానికి ప్రత్యేకం నెంబర్ కేటాయించాలని, భూ రికార్డుల ప్రక్షాళన గొప్ప విజయం సాధించింది, దీనిద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంచుభూమి లెక్క దొరికింది. 93% భూముల విషయంలో స్పష్టత వచ్చింది. కోర్టు కేసులు ఇతర వివాదాల్లో ఉన్న భూములకు సంబంధించి పార్ట్ బి లో నిర్ణయం జరుగుతుంది . గ్రామీణ ప్రాంతాల్లోని భూ రికార్డులు దాదాపుక్లీన్ అయ్యాయి. ఇక పట్టణ, నగర ప్రాంతాలపై దృష్టి పెట్టాలి. ఇక్కడ కూడా ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉందో తేల్చాలి . భూమి యజమానులను కూడా నిర్ధారించాలి. ప్రైవేటు ఆస్థులకు కూడా సర్వే నంబర్ల తరహాలో ప్రత్యేక నెంబర్లు కేటాయించే విధానం తీసుకొచ్చే విషయాన్ని పరిశీలించాలి . భూరికార్డుల ప్రక్షాళన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో భూ వివాదాలు తగ్గిపోతాయని ప్రభుత్వం భావిస్తోంది . పట్టణాలు, నగరాల్లో కూడా ఆ వాతావరణం రావడానికి ఏం చేయాలనే విషయంపై అధ్యయనం చేయాలి. తెలంగాణ భూభాగంలో ప్రతి ఇంచు ఎలా వుంది, ఎవరి ఆధీనంలో ఉంది, ఎలాంటి కార్యకలాపం జరుగుతుంది, తదితర అన్ని వివరాలు ప్రభుత్వం వద్ద ఉండాలి అని సీఎం అధికారులను కోరారు, మార్చి 11వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కొత్త పాస్ పుస్తకాల పంపిణి జరగాలి. దీనికోసం పాస్‌పుస్తకాల తయారీ రవాణా తదితర కార్యక్రమాలను రూపొందించుకోవాలి. మార్చి 5వ తేదీనాటికి అన్ని జిల్లాలకు పాస్‌పుస్తకాలు అందాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
KKP_2691

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *