
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో వికేంద్రీకరణ సూత్రాన్ని బలంగా నమ్ముతుందని, పాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలు మరింత వేగంగా చేరుతాయని మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. ఈ రోజు సచివాలయంలో తెలంగాణ మున్సిపల్ కమీషనర్ల డైరీ ని విడుదల చేశారు. మున్సిపల్ ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టామన్నారు. చరిత్రలో ఎన్నడు లేని విధంగా రాష్ర్టంలోని పలు మున్సిపాలీటీలకు, కార్పోరేషన్లకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామన్నారు. పట్టణాల్లో ఇప్పటికే అర్భన్ మిషన్ భగీరథ ద్వారా 4500 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నామని గుర్తు చేశారు. ఇప్పటికే 15 వేలకు మించి జనాభా ఉన్న పంచాయితీలను నగర పంచాయితీలుగా, మున్సిపాలీటీలుగా మార్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందన్నారు. వీటి ఎర్పాటు చేయడంతోపాటు నిధులను కూడా ఇస్తామన్నారు. ఇలా వీకేంద్రీకరణ ద్వారా ప్రజలకు పాలన ఫలాలు అందుతాయని తెలిపారు. జియచ్ యంసి లోనూ మరిన్ని సర్కిళ్లను, జోన్లను ఎర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ సంస్కరణల అమలులో మున్సిపల్ కమీషనర్ల కీలక పాత్ర వహించాలన్నారు. కమీషనర్ల తాము పనిచేస్తున్న పట్టణాలపైన ప్రత్యేక ముద్ర చాటుకునేలా పనిచేయాలన్నారు. స్ధానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతో కలసి సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఈ ఎడాది పలు పథకాలు కీలకమైన దశకు చేరుకున్నాయని, వాటిని పూర్తి చేసే దిశగా పనిచేయాలన్నారు. మున్సిపల్ కమీషనర్ల ప్రమోషన్లు, ఖాళీల భర్తీ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, యంఏల్యే శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గోన్నారు.