Breaking News

తెలంగాణ ముద్దుబిడ్డ సివిల్ సర్వీసెస్ ఆలిండియా టాప్ ర్యాంకర్ అనుదీప్ ను అభినందించిన కెసిఆర్

తెలంగాణ ముద్దుబిడ్డ సివిల్ సర్వీసెస్ ఆలిండియా టాప్ ర్యాంకర్ అనుదీప్ ను అభినందించిన కెసిఆర్

సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆలిండియా టాప్ ర్యాంకర్ గా నిలిచిన తెలంగాణ బిడ్డ దురిశెట్టి అనుదీప్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. ప్రగతి భవన్ లో అనుదీప్, ఆయన తల్లిదండ్రులతో కలిసి సిఎం మధ్యాహ్న భోజనం చేశారు. యువకులకు అనుదీప్ ఆదర్శంగా నిలిచారని సిఎం కొనియాడారు. లక్ష్యసాధన కోసం చిత్తశుద్ధితో క‌ృషి చేస్తే తప్పక విజయం సాధిస్తారనడానికి అనుదీప్ నిదర్శనమని సిఎం అన్నారు. ఈ కార్యక్రమంలో అనుదీప్ తల్లిదండ్రులతో పాటు పార్లమెంటు సభ్యులు, కల్వకుంట్ల కవిత, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బాల్క సుమన్, శాసన సభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, శ్రీనివాస్ గౌడ్, కరీంనగర్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, డిజిపి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దురిశెట్టి అనుదీప్ ను శాలువాతో సత్కరించారు.

KCR ANUDEEP 1     KCR ANUDEEP 2     KCR ANUDEEP 3     KCR ANUDEEP 4    KCR ANUDEEP 5

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *