Breaking News

తెలంగాణ మంత్రిమండలి నిర్ణయాలు..

Kcr_announce-02

హైదరాబాద్, ప్రతినిధి : పేద విద్యార్థుల చదువుల కోసం ప్రభుత్వం చెల్లించే ఫీజురీయింబర్స్ మెంట్ పథకం ఫాస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం మంగళం పాడింది. తెలంగాణ మంత్రిమండలి శుక్రవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైంది. దీనికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో పాటు మంత్రులందరూ సమావేశమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మంత్రిమండలి నిర్ణయాలు..
-ఫాస్ట్ పథకంను రద్దు చేసి పాత పద్ధతిలోనే విద్యార్థులకు ఫీజు చెల్లించేందుకు నిర్ణయం.
-120 గజాల్లో గుడిసెలు, ఇళ్లు వేసుకున్న పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించి వచ్చే నెల 20 నుంచి పట్టాలిస్తాం. 150 గజాల్లోపు ఉంటే నామమాత్రపు మొత్తంలో క్రమబద్దీకరించేందుకు నిర్ణయం
– ప్రస్తుత సచివాలయానికి భయంకరమైన వాస్తు దోషం ఉందని.. ఎర్రగడ్డలోని చాతి ఆస్పత్రి ప్రాంగణంలో నూతన సచివాలయంతోపాటు రాష్ట్ర శాఖాధికారుల కార్యాలయాలు నిర్మిస్తాం.
-తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్నో మొక్కుకున్నామని.. తిరుపతి దేవస్థానానికి రూ.5 కోట్ల ఆభరణలివ్వడంతో సహా ఆ మొక్కులన్నీ తీరుస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *