
తెలంగాణ మంత్రిమండలి బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలనే ఉద్దేశంతో తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో చౌకమద్యంను ప్రవేశపెట్టవద్దని నిర్ణయించారు. ఇక ఈసారి మద్యంకు పాత విధానమే మేలు అని చౌకమద్యంను ప్రవేశపెట్టవద్దన్నారు.
మంత్రిమండలి నిర్ణయాలు..
1.చౌకమద్యం రద్దు
2.ఈసాిరి పాత మద్యం విధానం
3. గుడుంబాపై ఉక్కుపాదం
4.నీటి పారుదల ప్రాజెక్టులకు మూడేళ్లలో 81 వేల కోట్లు
5.రూ.3900 కోట్లతో 60వేల రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం
6. 23 నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు.
7. హైదరాబాద్ లో నష్ట్రాల్లో ఉన్న ఆర్టీసీకి జీహెచ్ఎంసీ సాయం
8. మార్కెట్ కమిటీ పాలకవర్గాల్లో 50శాతం రిజర్వేషన్లు..
9. సెల్ ఫోన్ల పరిశ్రమలకు రాయితీలు
10. ప్రభుత్వోద్యోగులకు 3.144 శాతం డీఏ
11. కొత్త జిల్లాలపై సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు
12 సెల్ ఫోన్ల పరిశ్రమలకు రాయితీలు..