Breaking News

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బీసీ నేత

BJP

బీజేపీ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్యే లక్ష్మన్ ఎంపికయ్యారు. ఈ మేరకు జాతీయ అద్యక్షుడు అమిత్ షా కిషన్ రెడ్డి స్థానంలో లక్ష్మన్ ను ఎంపిక చేశారు. ఇప్పటివరకు కొనసాగిన కిషన్ రెడ్డిని జాతీయ శాఖలోకి తీసుకోనున్నట్టు సమాచారం. తెలంగాణలో బీజేపీ రోజురోజు పుంజుకోకపోవడం.. పార్టీలో అంతర్గత విభేదాలు, ఎన్నికల్లో ఓటములు, కిషన్ రెడ్డిపై అసంతృప్తుల నేపథ్యంలో కిషన్ రెడ్డిని మార్చారు. మరోవైపు ఈసారి తెలంగాణలో కిషన్ రెడ్డిపై భారీ గా వ్యతిరేకత వచ్చింది. ఆయనతో పార్టీ ముందడుగు వేయలేదని నిర్ధారించిన పార్టీ అధిష్టానం.. గట్టి లీడర్ గా ఉన్న లక్ష్మన్ కు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు.

తెలంగాణతో పాటు 5 రాష్ట్రాలకు వచ్చే 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అమిత్ షా యువకుల పార్టీ అద్యక్ష పదవులను అప్పగించారు. కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ సీఎం యడ్యూరప్పను నియమించారు. పంజాబ్ కు కేంద్ర మంత్రి విజయ్ సంప్లా, ఉత్తర ప్రదేశ్ కు ఓబీసీ నేత కేశవ్ ప్రసాద్ మౌర్య నియమితులయ్యారు. అరుణాచల్ ప్రదేశ్ పార్టీ అద్యక్షుడిగా మాజీ ఎంపీ తపిర్ గావో ను నియమించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *