తెలంగాణ బడ్జెట్ 1,15, 689 కోట్లు

హైదరాబాద్, ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టారు. 2015-16 సంవత్సరానికి సంబంధించిన ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టినందుకు గర్విస్తున్నానని ఆయన తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ ను రూ.లక్షా 15వేల 689 కోట్లుగా ఈటెల ప్రతిపాదించారు.

బడ్జెట్ ముఖ్యాంశాలు :
-రాష్ట్ర బడ్జెట్ రూ.లక్షా 15వేల 689 కోట్లు
-ప్రణాళిక వ్యయం రూ.52 వేల 383 కోట్లు
-ప్రణాళికేతర వ్యయం రూ. 63 వేల 306 కోట్లు
-రాష్ట్ర ఆర్థిక మిగులు రూ.531 కోట్లు
-ద్రవ్యలోటు రూ.16,969 కోట్లు
-రుణమాఫీ కోసం రూ.4,800 కోట్లు
-కళ్యాణ లక్ష్మీకి నిధుల కేటాయింపు
-రాష్ట్ర విద్యుత్ రంగంకు భారీగా కేటాయింపులు
– 4000 కోట్లు అప్పుకు కేంద్రాన్ని కోరాం.
-జీహెచ్ఎంసీ కి రూ.526 కోట్లు
– స్కై వేల కోసం రూ.1600 కోట్లు
– హైదరాబాద్ కు 170 ఎంజీడీల నీటి సరఫరా
-యాదగిరి గుట్టకు మరో 100 కోట్లు
-మిషన్ కాకతీయ కు రూ.2083 కోట్లు
-9308చెరువుల పునరుద్ధరణ
-రోడ్డు భవనాల శాఖకు రూ.4980 కోట్లు
-పంచాయతీరాజ్ శాఖకు రూ.2421 కోట్లు
-విద్యారంగానికి రూ.11,216 కోట్లు
-హరిత హారానికి రూ.325 కోట్లు
-వైద్య ఆరోగ్య శాఖకు రూ.4932 కోట్లు
-జలహారానికి రూ.4000 కోట్లు
-విద్యుత్ రంగానికి రూ.7400 కోట్లు
-పారిశ్రామిక అభివృద్ధికి రూ.973 కోట్లు
-ఎస్సీ ఉప ప్రణాళిక కు రూ.8099 కోట్లు
-ఎస్టీల సంక్షేమానికి రూ.2878 కోట్లు
-మైనార్టీ సంక్షేమానికి రూ.1105కోట్లు
-బీసీల సంక్షేమం కోసం రూ.2172 కోట్లు
-పాలమూరు, నక్కలగండి ప్రాజెక్టుల చేపట్టడానికి నిర్ణయం

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *