
భగీరథ పథకంతో ఆరోగ్యవంతమైన మంచినీరు
సమాజ శ్రేయస్సు కోసమే సంక్షేమ పథకాలు
బాలానగర్, జడ్చర్ల మండలాల్లో చీరలు, గొర్రెలు పంపిణీ
గుండేడులో మంచినీటీ ట్యాంకుకు భూమి పూజ
కోడ్గల్లో సంచార పశువైద్య వాహనం ప్రారంభం
పాఠశాల స్థాయి క్రీడల పోటీల ప్రారంభం
–వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శమన్నారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి. బాలానగర్ మండలం గుండేడు, జడ్చర్ల మండల మాచారం, గంగాపూర్, కోడ్గల్ లలో బతుకమ్మ చీరలను మంత్రి పంపిణీ చేశారు. అలాగే కోడ్గల్ లో గొల్ల కురుమలకు గొర్రెలను పంపిణీ చేశారు. కోడ్గల్లో సంచార పశువైద్య వాహనం ప్రారంభించారు. పాఠశాల స్థాయి క్రీడల పోటీల ప్రారంభం గుండేడ్లో 20వేల లీటర్ల మంచినీటి ట్యాంకు పనులను భూమి పూజ చేసి ప్రారంభించారు. ఆ పక్కనే పాఠశాలలో క్రీడలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిఎం కెసిఆర్ నేతృత్వంలో అద్భుత పథకాలు అమలు అవుతున్నాయన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, వాటిని తమ తమ ప్రాంతాల్లో అమలు చేయడానికి పరిశీలిస్తున్నాయని మంత్రి చెప్పారు. ఒక చేత్తో అభివృద్ధిని మరో చేత్తో సంక్షేమాన్ని సమంగా నడిపిస్తున్న ఘనత మన సీఎం కెసిఆర్దని మంత్రి చెప్పారు. రూ.45వేల కోట్లతో సంక్షేమ పథకాలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనూ అమలు కాలేదన్నారు. ప్రజోపయోగ పథకాలను మంత్రి వివరించారు. బతుకమ్మ చీరల పథకాన్ని ఏకరువు పెట్టారు. మన మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా చీరలు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన మన ప్రతి పండుగని ఘనంగా జరుపుకోవాలన్నదే సీఎం కెసిఆర్ సంకల్పమన్నారు. అందుకే అన్ని పండుగలకి ఇంటికి పెద్దన్న లెక్క కెసిఆర్ బట్టలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి పథకాలని సైతం విమర్శిస్తున్న వారున్నారని, అలాంటి వారికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మహిళా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఆరోగ్యలక్ష్మి, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్లు, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు వంటి అనేక పథకాలను మంత్రి మహిళలకు వివరించారు. ఇంత పెద్ద ఎత్తున మహిళల కోసం పలు పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం కూడా గతంలో ఎన్నడూ లేదన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి అండగా నిలవాలని మహిళలను మంత్రి కోరారు. ఇంత గొప్ప పథకాలను చేపట్టి ఆడవారి ఆత్మగౌరవాన్ని కాపాడుతున్న సీఎం కెసిఆర్ని ఎల్లప్పుడూ ఆదరించాలని మంత్రి మహిళ లకు విజ్ఞప్తి చేశారు.
గుండేడులో
గుండేడులో మంత్రి లక్ష్మారెడ్డి 20 వేల లీటర్ల మంచినీటి ట్యాంకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లాల ద్వారా స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన మంచినీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. నీరు, మనం తీసుకునే ఆహారం వల్లే అత్యధిక రోగాలు వస్తుంటాయని, మంచినీటిని తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఆరోగ్య తెలంగాణ దిశగా మిషన్ భగీరథ పథకం పని చేస్తుందని మంత్రి వివరించారు. అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి పాఠశాల క్రీడలను ప్రారంభించారు. నిత్య జీవితంలోనూ క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలని విద్యార్థులకు ఉద్బోధించారు.
వృత్తులకు పూర్వ వైభవం
అలాగే కోడ్గల్ లో గొల్ల కురుమలకు గొర్రెలను పంపిణీ చేశారు మంత్రి లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అడుగంటి పోతున్న కుల వృత్తులకు పూర్వ వైభం తేవడానికి సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారన్నారు. గొల్ల కురుమలకు గొర్రెలు, మేకలు, చేపలు పట్టుకునే వాళ్ళకి చెరువుల్లో చేపలు పెంపకం, చేనేతలను ఆదుకోవడానికి చీరల పంపిణీ, ధూప దీప నైవేద్యాలకు బ్రాహ్మణులకు అవసరమైన నిధులు… ఇలా మన సమాజంలోని అన్ని వృత్తులను ఆదుకుంటున్న ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. వృత్తులకు ప్రత్యామ్నాయాలను చూపలేని ప్రభుత్వాలు, ఆయా వృత్తులను ఆగమాగం చేశాయన్నారు. సమాజం మీద లోతైన అవగాహన ఉన్న సీఎం అడుగంటి పోతున్న వృత్తులను ఆదుకోవడం ద్వారా ప్రజలందరి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారని మంత్రి లక్ష్మారెడ్డి వివరించారు.
పాడి పంటలే పల్లెలలు పట్టుగొమ్మలు
కోడ్గల్లో సంచార పశు వైద్య వాహనం ప్రారంభం
ఇక కోడ్గల్లో సంచార పశు వైద్య వాహనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాడి పంటలే పల్లెలలు పట్టుగొమ్మలు అన్నారు మంత్రి. గతంలో పశువులు, పాడిలేని గ్రామాలుండేవి కావని మంత్రి తెలిపారు. అవి అంతరించిపోతున్న దశలో ప్రభుత్వం పాడి పరిశ్రమలను ప్రోత్సహించడానికి సంచార పశు వైద్య వాహనాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతుల వద్దకే వెళ్ళి, పశు వైద్యాన్ని అందించనున్నట్లు మంత్రి తెలిపారు.
ఆతర్వాత మంత్రి లక్ష్మారెడ్డి బాదేపల్లిలో ఫిజియో థెరపీ క్లీనిక్ని ప్రారంభించారు. అనంతరం లక్ష్మణ్ నాయక్ తండాలో సంత్ సేవాలాల్ మహారాజ్ స్వాముల పడి పూజలో పాల్గొన్నారు. సేవాలాల్ చూపిన దారిలో లంబాడీలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమాజ సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షించారు.