తెలంగాణ ప్రభుత్వ విధానాలతోనే రాష్ర్టంలోకి భారీ పెట్టుబడులు- మంత్రి కెటి రామారావు

తెలంగాణ ప్రభుత్వంతో యంఒయు చేసుకున్న సికె బిర్లా గ్రూప్

రాష్ట్రంలో రెండు వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఓరియంట్ సిమెంట్ కంపెనీ

కంపెనీ విస్తరణ ద్వారా 4వేల ఉద్యోగాలు, పరోక్షంగా మరో నాలుగు వేల ఉద్యోగాలు

స్ధానికులకే ఉద్యోగాలు కల్పించాలని కంపెనీని కోరిన మంత్రి, అవసరం అయితే ప్రత్యేకంగా శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్న మంత్రి

మంచిర్యాల లోని దేవాపూర్ లోని తమ సిమెంట్ ప్లాంట్ విస్తరణ

టియస్ యండిసి నుంచి ప్లాంట్ విస్తరణ మేరకు లైమ్ స్టోన్ సరఫరాకు ఒప్పందం

మంత్రి కెటియార్, గ్రూప్ చైర్మన్ సికె బిర్లా సమక్షంలో జరిగిన యంవోయు

తెలంగాణలోని పరిశ్రమల స్నేహాపూర్వక వాతావరణం, పారిశ్రామిక విధానల పట్ల ప్రసంశలు కురింపించిన సికె బిర్లా

ప్రస్తుతం రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ తన భారీ విస్తరణ ప్రణాళికలను సోమవారం రోజు ప్రకటించింది. ప్రస్తుతం మంచిర్యాలలోని దేవపూర్ లో ఉన్న సీకే బిర్లా గ్రూపు తన సిమెంట్ ఫ్యాక్టరీని సుమారు రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈరోజు జరిగిన కార్యాక్రమంలో తెలంగాణ ప్రభుత్వంతో ఈమేరకు ఒక అవగాహణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు, సికె బిర్లా గ్రూప్ చైర్మన్ సికె బిర్లాలు హైదరాబాద్ లో జరిగిన అవగాహాణ ఒప్పంద సమావేశంలో పాల్గోన్నారు. కంపెనీ తుది అనుమతులు పొందే పక్రియ వేగంగా జరుతున్నదని, త్వరలోనే అన్ని అనుమతులు కేంద్రం నుంచి లభిస్తాయని గ్రూపు చైర్మన్ సికె బిర్లా తెలిపారు. త్వరలోనే విస్తరణ పనులు ప్రారంభం అవతాయన్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న తెలంగాణలో ఉన్న అద్బుతమైన పారిశ్రమల స్నేహపూర్వక వాతావరణం గురించి సికె బిర్లా ప్రసంశలు కురింపించారు. కొత్తగా ఏర్పడిన రాష్ర్టం అయినప్పటికీ తెలంగాణ దేశంతో ఇప్పటికే అనేక వినూత్నమైన ప్రభుత్వ పాలసీలతో ముందువరుసలో ఉందని, ముఖ్యంగా పారిశ్రామిక విధానాలతో పరిశ్రమల వర్గాల్లో మంచిపేరు సంపాదించుకుందని తెలిపారు. కంపెనీ విస్తరణ ద్వారా తెలంగాణ విధానాల పట్ల తమ గ్రూప్ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నామని తెలిపారు. కొత్త పరిశ్రమలకు పెట్టుబడులను అకర్షించడంతోపాటు ఉన్న పరిశ్రమలకు మరింత సహాకరించడం, మూతపడిన పరిశ్రమలను తెరిపించడం వంటి అంశాల కోసం బహుముఖ వ్యూహంతో ముందుకు పొతున్నామని మంత్రి కెటి రామారావు తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే సిర్పూర్ పేపర్ మిల్లు తిరిగి తెరిపించడంతో విజయం సాధించామని, ఈ రోజు ఒరియంట్ సిమెంట్స్ విస్తరణకు అంగీకారం కుదిరిందన్నారు. ఓరియంట్ సిమెంట్స్ విస్తరణ ద్వారా రెండువేల కోట్ల రూపాయాల నూతన పెట్టుబడులు తెలంగాణ రాష్ర్టానికి వస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. ఈ ప్లాంటు విస్తరణ ద్వారా సుమారు నాలుగు వేల మందికి ప్రత్యక్ష ఉపాధితోపాటు పరోక్షంగా మరి 8 వేలమందికి ఉపాధి లభిస్తుందన్నారు. కంపెనీలో స్థానిక యువకులకే ఉద్యోగ అవకాశాలు దక్కేలా చూడాలని కంపెనీని కోరామన్నారు. ఇందుకోసం అవసరం అయితే ఒక శిక్షణ కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. దీంతోపాటు తెలంగాణలో ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరామన్నారు. సికె బిర్లా విస్తరణ ప్రకటన ద్వారా పారిశ్రామిక వర్గాల్లో తెలంగాణ పట్ల మరింత విశ్వాసం పెరుగుతుందని, మరిన్ని నూతన పెట్టుబడులు రాష్ర్టానికి వస్తాయన్న అశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. యంవోయు ఒప్పందం సమావేశంలో తెలంగాణలో గత నాలుగేళ్లలో జరిగిన అభివృద్దిని, వివిధ ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వ ప్రాధాన్యతలను మంత్రి కెటియార్, సికె బిర్లాకు వివరించారు. రాష్ర్టం ఏర్పడిన తొలినాళ్ల  నుంచే ప్రాథమిక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తూ అభివృద్ది పథంలో నడుస్తున్నామని తెలిపారు. ప్రజలకు అవసరం అయిన తాగునీరు కోసం మిషన్ భగీరథ, సాగునీటి కోసం నూతన ప్రాజెక్టుల నిర్మానం, సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ముందుగా కరెంటు కొరత నుంచి అన్ని వర్గాలకు సైతం నిరంతరం కరెంటు సరపరా చేసే స్ధాయి చేరుకున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వ పారదర్శక విధానాలను పరిగణలోకి తీసుకొని అనేక నూతన పెట్టుబడులు రాష్ట్రంలోకి గత నాలుగు సంవత్సరాలలో వచ్చాయని, నూతన పెట్టుబడులతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక కంపెనీలు, సంస్థలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నయని తెలిపారు.

ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తోపాటు టీఎస్. ఎం. డి. సి ఛైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, మేనేజింగ్ డైరక్టర్ మల్సూర్ ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.