తెలంగాణ ప్రభుత్వం – పశు వైద్య పశు సంవర్దక శాఖ ఆంటి మైక్రోబియల్ రెసిస్టన్స్ అనే అంశం పై రాష్ట్ర స్థాయి సదస్సు

పశువులలో ఆంటి మైక్రోబియల్ రెసిస్టన్స్, అనగా సూక్ష్మ క్రిములు అంటి బయోటిక్ మందులను తట్టుకుని స్థాయి కి ఎదగడం , అనే అంశం పై ప్రస్తుత స్థితి మరియు భవిష్యత్ విధి విధానాలు చర్చించుటకు పశు వైద్య పశు సంవర్ధక శాఖ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ నందు , పశు వైద్య అధికారులు , పశు వైద్య శాస్త్ర వేత్తలు , పశు గణ రంగ ప్రతినిధులతో కూడిన రాష్ట్ర స్థాయి సదస్సు తేది 24.01.2018 నాడు నిర్వహించ బడినది . ఈ కార్య క్రమానికి , పశు సంవర్ధక , పాడి పరిశ్రమ , మత్స్యశాఖ కార్య దర్శి శ్రీ సందీప్ సుల్తానియా , ఐ ఎ యస్ గారు ముఖ్య అతిథి గా పాల్గొన్నారు .

కార్యక్రమ ఆరంభములో కార్యదర్శి సందీప్ సుల్తానియ గారు, డా.డి. వెంకటేశ్వర్లు సంచాలకులు – పశు సంవర్ధక సంచాలకులు , డా కొండల రెడ్డి- రిజిస్ట్రార్పి .వి.ఎన్.ఆర్ తెలంగాణా పశువైద్య విశ్వవిద్యాలయం , డా రంజిత్ రెడ్డి- తెలంగాణా పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షులు , డా సురేష్ -యన్ ఐ యన్ శాస్త్ర వేత్త మరియు అదనపు సంచాలకులు డా రాంచందర్ లతో , జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ముఖ్య అతిథి గా పాల్గొన్న శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా , సెక్రటరీ గారు మాట్లాడుతూ , మానవులకు పౌష్టికాహారాన్ని అందించడములో పశు ఉత్పత్తులైన పాలు , గ్రుడ్లు మాంసం యొక్క ప్రాధాన్యత ఎంతైనా ఉందని తెలిపారు .

మానవాళికి అవసరమైన పశు ఉత్పత్తులను అందిచడానికి పశు ఆరోగ్య రక్షణ ముఖ్యo కావున పశు ఆరోగ్య రక్షణ లో సూక్ష్మ క్రిముల నియంత్రణకు అంటి బయోటిక్ అవసరం మేరకే వినియోగించడం , వీలైనంత వరకు హేర్బాల్ మందులు వాడడం, అత్యవసర పరిస్తితులలోనే అంటి బయోటిక వాడడం తదితర అంశాలపై సదస్సులో పాల్గొన్న పశువైద్యులు మరియు పశు వైద్య శాస్త్రవేత్తలు కూలంకషంగా చర్చించి భవిష్యత్తులో సూక్ష్మ క్రిములు అంటి బయోటిక్ మందులకు రెసిస్టన్స్ పొందకుండా ఇటు పశువుల మరియు పరోక్షంగా మానవుల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన సూచనలు ప్రతిపాదించాలని కోరారు.

డా డి వెంకటేశ్వర్లు ,పశు సంవర్ధక సంచాలకులు గారు , ప్రారంభ ఉపన్యాసములో మాట్లుడుతు అంటి బయోటక్స్ , విరివిగా మరియు అనవసరంగా వాడాడం వల్ల సూక్ష్మ క్రిములు ఆంటి బయోటిక్ మందులను తట్టుకునే స్థాయికి ఎదగడం అనేది భవిషత్తులో అత్యంత క్లిష్ట మైన సమస్య గా పరిణమించే అవకాశముందని , ఈ ప్రాధాన్యత ను దృష్టిలో ఉంచుకొని పశు వైద్యులలో , పశు వైద్య శాస్త్ర వేత్తలలో అవగాహన పెంపొందించడం, సూక్ష్మ క్రిములలో అంటి బయోటిక్ తట్టుకునే ప్రస్తుత స్థాయి , మరియు భవిషత్తు లో చేపట్టవలసిన చర్యల గురించి చర్చిచి ప్రతిపాదనలు చేయడం, వ్యాదుల నివారణలో హెర్బల్ మందుల వినియోగం తదితర అంశములపై చర్చించి తగు ప్రతిపాదనలు చేసే లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహించడమైనదని తెలిపారు.

sandeep sulthana 1 new

డా రంజిత్ రెడ్డి , అధ్యక్షులు పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ గారు మాట్లాడుతూ , మన తెలంగాణ రాష్ట్రo, కోడి గ్రుడ్లు మరియు కోడి మాంసం ఉత్పదానలో 3 వ మరియు 4 వ స్థానాలలో నిలుస్తుందని , కోళ్ళ పెoపకములో మరియు ఆరోగ్య పరిరక్షణలో శాస్త్రీయ విధానములో పాటిస్తూ ఉత్పాదక పెంపొందించడం జరుగుతుందని , కోళ్ళ ఆరోగ్య పరి రక్షణకు , వ్యాదుల నివారణకు పటిష్టమైన టీకాలు వినియోగించి వ్యాదులను అరికట్టడం జరుగుతున్నదని , అంటి బయోటిక్ మందుల వినియోగం అతి తక్కువ స్థాయిలో ఉందని తెలిపారు , ఈ సదస్సులు పాల్గొన్న పశు వైద్య శాస్త్ర వేత్తలు ,వైద్యులు పౌల్ట్రీ రంగములో అంటి బయోటిక్ ఉపయాగం పై తగు సూచనలు సలహాలు ప్రతిపాదించాలని కోరారు . ఈ సదస్సు నిర్వహణలో డా కళా కుమార్ శాస్త్ర వేత్త, డా బాబు బేరి పశు సంవర్ధక అధికారి చురుకుగా పాల్గొన్నారు .

ఈ కార్య క్రమములో పశు వైద్య విశ్వవిద్యాలయము నుండి డా .వీరోజి రావు , డీన్, , ఇతర పశువైద్య శాస్త్ర వేత్తలు , పశు సంవర్దక అధికారులు డా యమ నరంహ రెడ్డి , ఇతర పశు సంవర్ధక అధికారులు , జిల్లాల నుండి వచ్చిన వివిధ పశు వైద్య నిపుణులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *