తెలంగాణ ప్రజలకు రూ.2కే కిలో గోధుమలు

11-wheat-1

బియ్యం ఇయ్యమంటే కేంద్ర ప్రభుత్వం గోధుమలు కేటాయించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం వద్ద అవి భారీగా పేరుకుపోయాయి. చేసేదేం లేక టీ ప్రభుత్వం ఇప్పుడు వాటిని వదిలించుకోవడానికి ధర తగ్గించింది. రూ.2కే కిలో గోధుమల్ని రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించింది. గ్రామాల్లోని లబ్దిదారులకు 2 కిలోలు.. పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు 5 కిలోలను పంపిణీ చేయాలని నిర్ణయించింది.

కాగా ఆహార భద్రత చట్టం కింద కేంద్ర ప్రభుత్వం బియ్యం, గోధుమల్ని రాష్ట్రాలకు కేటాయిస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి ప్రజలు గోధుమల్ని వాడరని.. బియ్యం పంపిణీ చేయాలని కోరింది. దానికి నో చెప్పిన కేంద్రం గోధుమల్నే కేటాయించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గోధుమల్ని పేదలకు మరింత తక్కువ ధరకు ఇస్తే అమ్మేయవచ్చని యోచిస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *