తెలంగాణ పూదోటలో విరిసిన ‘ఈటెల’

ఉద్యమ కారుడే తెలంగాణ ఆర్థిక మంత్రి అయితే ఆ రాష్ట్ర పరుగు అపలేదు.. అందుకే తెలంగాణ 11 శాతం వృద్ధి తో దేశ సగటునే దాటేసింది. తెలంగాణ తొలి ఆర్థిక మంత్రిగా 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టే అదృష్టం దక్కిన ఈటెల ది చాలా అదృష్టమనే చెప్పాలి. బడుగు బలహీన వర్గాల నేతగా టీఆర్ఎస్ ఉద్యమపార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన ఈ కరీంనగర్ ముద్దుబిడ్డ.. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొంది రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.
సమైక్య రాష్ట్రంలో ఆనాడు తెలంగాణ శాసనసభలో టీఆర్ఎస్ శాసనసభాపక్షనేతగా సత్తాచాటాడు. అనక ఇప్పుడు ఆర్థిక, పౌరసరఫరాల శాఖ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తూ తెలంగాణ నావను సరైన రీతిలో నడిపించే ఆర్థిక విశ్లేషకుడి పాత్రను సమర్థంగా పోషిస్తున్నారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని మరిన్ని విజయాలను సాధించాలని కాంక్షిస్తూ..

ఈటెల రాజేందర్ పుట్టిన రోజు సందర్బంగా ఆయనకు ఇవే మా హార్థిక శుభాకాంక్షలు
-చీఫ్ ఎడిటర్ మరియు పొలిటికల్ ఫ్యాక్టరీ టీం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *