Breaking News

తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి

ponnala-and-utttam

-జానారెడ్డిని తప్పించి మల్లు భట్టివిక్రమార్కకు శాసనసభాపక్ష పదవి..
హైదరాబాద్, ప్రతినిధి : పీసీసీ చీఫ్ గా కొనసాగుతున్న పొన్నాల లక్ష్మయ్యకు అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆయనను పీసీసీ అధ్యక్షపదవి నుంచి తొలగించి హుజూర్ నగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టింది. కాగా ఈ నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపింది.

అంతేకాకుండా అధిష్టానం శాసనసభలో కాంగ్రెస్ శాసనసభాపక్షనేతగా కొనసాగుతున్న జానారెడ్డికి సైతం జలక్ ఇచ్చింది. ఆయన పదవిని మధిర ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు మల్లు భట్టివిక్రమార్కకు కట్టబెట్టింది. అంతేకాకుండా జానారెడ్డి అర్జంట్ గా ఢిల్లీ రావాలని కోరింది..

ఈ రెండు నిర్ణయాలు జానారెడ్డి, పొన్నాల వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తిక కారణమైంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *