
సెప్టెంబర్ 17 .. తెలంగాణ విమోచన దినం.
తెలంగాణ నైజాం దాస్య శృంకాలాలను తెంచుకున్నరోజు.. సెప్టెంబర్ 17. శతాబ్దాలుగా నిజాంల కబంధ హస్తాల్లో నలిగిపోయిన తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిన రోజు… ఆగస్టు 15, 1947 భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.. కానీ తెలంగాణ ఇంకా బానిస సంకెళ్తో అంధకారలోనే ఉంది.. దేశమంతా త్రివర్ణ జెండాలు ఎగురుతున్న వేళ..తెలంగాణ ప్రజానీకం .. రజాకార్ల చేతుల్లో చిత్రహింసలకు గురవుతున్నారు..
తెలంగాణ సాయుధ పోరాటం.. నిజాంల గుండెల్లో గుబులు పుట్టించింది. రైతులు, కర్షకులు, కార్మికులు ప్రజలు బండెనక బండికట్టి.. గన్నులు చేతబట్టి సాగించిన ఈ మహాపోరాటం తెలంగాణకు విముక్తి కలిగేలా చేసింది.. చివరకు 1948 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడాది గడిచిన తర్వాత భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్ల భాయ్ పటేల్ ధైర్యం చేసి భారత సైన్యంతో హైదరాబాద్ పై దండెత్తాడు.. భీకరయుద్దంలో ఎంతో మంది నిజాం సైన్యం, భారత సైనికులు నేలకొరిగారు.. చివరకు నిజాం రాజు లొంగిపోయి పాకిస్తాన్ కు వలసపోయాడు.. అప్పుడు సెప్టెంబర్ 17.. తెలంగాణ నైజాం నుంచి భారత దేశంలో విలీనమైంది.. రజాకార్ల ఆకృత్యాలు సమసిపోయాయి… ఈ సెప్టెంబర్ 17 తెలంగాణకు స్వాతంత్ర్య దినం.. విలీనం కాదు.. నిజాంల నుంచి విమోచనమే..
అమరుల త్యాగాల ఫలితమైన ఈ సెప్టెంబర్ 17ను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లిం ఓట్ల కోసం ప్రభుత్వం నిర్వహించకపోవడం దారుణం.. స్వార్థం కన్నా స్వాతంత్య్రం గొప్పది.. తెలంగాణ .. త్యాగాల వీణ..