తెలంగాణ తల రాత మారుస్తాం..

-కాంగ్రెసోళ్లకు విమర్శించడానికి ఏమీ లేకుండా చేస్తాం
-50 ఏళ్ల కరెంటు కష్టాలను ఏడాదిలో తీర్చినం
-సంక్షేమ, వ్యవసాయం, అభివృద్ధి మా ధ్యేయం
-ప్లీనరీలో సీఎం కేసీఆర్ హామీ
హైదరాబాద్ : ఈ ఐదేళ్లలో తెలంగాణ తలరాతను మారుస్తామని.. తెలంగాణను అభివృద్ధి పరిచి చూపిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెసోళ్లకు విమర్శించడానికి ఏ ఒక్క సమస్య ఉండకుండా పనులు చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ శాసనసభ ఏర్పడిన రోజే కాంగ్రెస్, టీడీపీల్లో కరెంటివ్వాలని ఆందోళన చేశారని.. కానీ ఈ పదినెలల కాలంలో కరెంటు సమస్యను తీర్చినమని.. ప్రతిపక్షాలు ఇప్పుడు కరెంటు కొరతలపై మాట్లాడుతలేవన్నారు.

మడమ తిప్పని మాట తప్పని పార్టీ టీఆర్ఎస్ , టీఆర్ఎస్ తోనే తెలంగాణ వచ్చిందన్నారు. అమరుల త్యాగం వెలకట్టలేనిదన్నారు. వారి కుటుంబాలను గుండెల్లో పెట్టుకుంటామన్నారు.

తెలంగాణ ఆంధ్రా లో ఉన్నప్పుడు ఎన్నో అవమానాలు చేశారు.. తెలంగాణ లో మొదటి జెండా ఎగురవేసిందని గోల్కొండలో ఎగురవేశామని ఇది మనకు గర్వకారణమన్నారు. తంగెడుపువ్వు ను రాష్ట్ర పువ్వు, జమ్మిచెట్టు వృక్షంగా, జంతువు జింకగా, పక్షిగా పాలపుట్టను మనం ప్రకటించుకున్నామన్నారు. కొమురం భీం ఉద్యమ స్ఫూర్తితో జోడేఘాట్ లో స్మారకం ఏర్పాటు చేశామని తెలిపారు.

పీవీ నరసింహారావు మన తెలంగాణ బిడ్డ కావడం గర్వకారణమన్నారు. కాంగ్రెస్ పీవీని మరిచిన మన బిడ్డను మన తెలంగాణలో గౌరవించుకున్నామన్నారు. కొండా లక్ష్మన్, కాళోజీ పీవీ, దశరథి, సేవాలల్, జయశంకర్ పేర్లను యూనివర్సిటీలకు పెట్టామన్నారు.

తెలంగాణ కళలు, సంస్కృతి, అద్దంపట్టేలా కళాభారతి నిర్మిస్తామని.. యాదగిరి గుట్టను దివ్యక్షేత్రంగా అభివృద్ది పరుస్తామన్నారు. గోదావరి పుష్కరాల్లో ఈసారి ధర్మపురిలో తాను స్వయంగా స్నానం చేస్తానని తెలిపారు. గోదావరి పుష్కరాల్లో ఆంధ్రాసర్కారు తెలంగాణకు నిధులు కేటాయించక అన్యాయం చేసిందన్నారు. పుష్కరాలను కుంభమేళాలో చేస్తామన్నారు. ధర్మపురి నరసింహుని పాదాభివందనం, క్షీరాభిషేకం, గోదావరి స్వర్ణకంకణం చేస్తానని కేసీఆర్ చెప్పారు.

దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పారు. ముస్లిం, మైనార్టీ, సిక్కు, బీసీల దరిద్రాన్ని పారదోలుతామన్నారు. 34000 వేల మంది రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసిన ఘనత తామేదన్నారు.

కాంగ్రెస్, టీడీపీ ల గత పాలనపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణను దోపిడీ చేసింది ఈ రెండు పార్టీలేనని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పార్టీ 10 నెలల కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి బంగారు తెలంగాణకు అడుగులు వేస్తోందని.. దాన్ని జీర్ణించుకోలేకే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఓ పత్రికలో వ్యాసం రాసిన జర్నలిస్టు బుట్ట మురళి సరైన మార్గదర్శనం చేశారని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *