
హైదరాబాద్ : పర్యాటకుల కోసం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రత్యేక సమ్మర్ ప్యాకేజీలను ప్రకటించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక స్థలాలను కలుపుతూ పర్యటన ఆహ్లాదకరంగా ఉండేటట్లు ప్యాకేజీని రూపొందించింది.ఈ ప్యాకేజీల బస్సులు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ లోని టూరిజం సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం నుంచి బయలుదేరుతాయి.
వేములవాడ, భద్రాచలం,బాసర సరస్వతీ క్షేత్రం, ఆలంపూర్, యాదగిరి గుట్ట, సౌత్ ఇండియా టూర్, పాపికొండలు, అరకు , గోవా, ఊటీ, మైసూర్, బెంగళూరు టూర్ కు ప్యాకేజీలున్నాయి.
మరిన్ని వివరాలకు బషీర్ బాగ్ సెంట్రల్ రిజర్వేషన్ కేంద్రం ఫోన్ నంబర్లు 040-66746370, 66745986, సెల్ 9888848540371.