
తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు సమాలోచనలు జరిపారు. ఈ భేటిలో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు అందరూ హాజరయ్యారు. కాగా నూతన అధ్యక్షుడి ఎంపికకు ప్రజల్లో సర్వే చేయనున్నట్లు సమావేశం అంగీకరించింది.. సర్వే ఆధారంగా ఎవరిని నియమిస్తే మంచిదో తేలనుంది..
కాగా చంద్రబాబు మనసులో మాత్రం తెలంగాాణ టీడీపీ పగ్గాలు ఎర్రబెల్లి లేదా పెద్దిరెడ్డి ఇచ్చేయాలనే ఆలోచనలో ఉన్నారట.. కార్యకర్తలు , ప్రజల్లోకి వెళితే ఎర్రబెల్లికే ఎక్కువ చాన్స్ ఉంది.. మరో వైపు జనంలో క్రేజ్ ఉన్న రేవంత్ రెడ్డికి చాన్స్ ఉన్నా ఆయన జూనియర్ కావడం పార్టీలో సీనియర్లు చాలా మంది ఉండడంతో ఆయనకు అవకాశం దక్కకపోవచ్చు..