తెలంగాణ జిల్లాలన్నీ గ్రోత్ సెంటర్లుగా ఎదగాలి

★ తెలంగాణ జిల్లాలన్నీ గ్రోత్ సెంటర్లుగా ఎదగాలి
★ ప్రజా సమస్యలకు మూలాలను గుర్తించండి
★ జిల్లాల ఎకానమీ ప్రణాళికలు రూపొందించుకోండి
★ ఇది పోరాడి సాధించుకున్న తెలంగాణ
★ అభివృద్ధిలో కలెక్టర్ల పవర్ చూపించండి
★ బంగారు తెలంగాణ కు పునాదులు నిర్మించండి
★ 31 జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి కెసిఆర్ దిశానిర్దేశం
★ ప్రగతి భవన్ లో 11 గంటల కలెక్టర్ల మీటింగ్ సక్సెస్

రాష్ట్రాల అభివృద్ధి నమూనా తరహాలోనే తెలంగాణలోని జిల్లాల ఎకానమీ ని రూపొందించుకుంటూ ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుక్కునే విధంగా 31 జిల్లాల కలెక్టర్లు సమగ్ర కార్యాచరణ దిశగా అడుగులు వేయాలని ముఖ్యమంత్రి కె . చంద్ర శేఖర రావు ఆదేశించారు . జిల్లాల పునర్విభజన తర్వాత మొదటి సారి 11 గంటల పాటు ప్రగతి భవన్ లో బుధవారం నాడు జరిగిన సుదీర్ఘ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సమస్యలనకు పరిష్కార మార్గాలను అన్వేషించే తరహాలో జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు . జిల్లాల భౌగోళిక స్వరూపం , వనరులు , ప్రజలు ఆధారపడ్డ రంగాలు అన్నింటినీ సమగ్రంగా అధ్యయనం చేసి జిల్లాల ఎకానమీ ని రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు . సమైక్య ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మూస పరిపాలనా విధానానికి పూర్తిగా స్వస్తి చెప్పి తెలంగాణ అస్తిత్వ , అభివృద్ధి కోణంలో ప్రజలకు దగ్గరగా పరిపాలన చెయ్యాలని సూచించారు . కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత పరిపాలన దగ్గరికి రావడంతో  ప్రజలు తామే కలెక్టర్లు అయినట్లుగా సంతోష పడుతున్నారని వారి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా కృషి చేయాలని సి.ఎం పేర్కొన్నారు . ప్రధానంగా లోకల్ రిసోర్స్ మ్యాపింగ్ ఆధారంగా ఆయా జిల్లాల అభివృద్ధి ప్రణాళికలు తయారు కావాలన్నారు . ప్రతి జిల్లా కలెక్టర్ , ఎస్పి దగ్గర మొత్తం ప్రజల వివరాలు ఉంటే దానికనుగుణంగా సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందే విధంగా కృషి చేయవచ్చన్నారు .

తెలంగాణ లో మొదటి భారీ మీటింగ్ హాల్…

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 250 మంది అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించడానికి ఇటీవల కొత్తగా నిర్మించిన ప్రగతి భవన్ వేదిక అయింది . గతంలో పది జిల్లాల కలెక్టర్ల మీటింగ్ పెట్టడానికే సరైన మీటింగ్ హాల్ లేక చాలా ఇబ్బందులు ఏర్పడేవి . బయట ఎక్కడ మీటింగ్ పెట్టాలన్నా కిరాయిలు కట్టుకోవడంతో పాటు సమావేశానికి ముఖ్యమంత్రి వెళ్ళడానికి ట్రాఫిక్ లో ప్రజలకు కొంత ఇబ్బంది కలుగుతుండేది . సెక్యూరిటీ పరమైన సమస్యలు కూడా ఉత్పన్నమయ్యేవి . ఇప్పుడు రెగ్యులర్ గా మీటింగ్స్ నిర్వహించుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు . 58 ఏళ్ళ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి పరిపాలనా సౌలభ్యమైన ఒక మంచి హాల్ నిర్మించారని చాలా మంది కలెక్టర్లు , ఎస్ పి లు ఆనందం వ్యక్తం చేశారు .

కొత్త జిల్లాల ఫలితాలు కనిపిస్తున్నయి…

కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని , పాలన తమ దగ్గరికి వచ్చిందనే అభిప్రాయంతో ఉన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు . భువనగిరి వంటి ఏరియా ఆస్పత్రుల్లో కలెక్టర్ తనిఖీతో పరిస్థితి మెరుగుపడిందని ఇలా అన్ని జిల్లాల కలెక్టర్లు గ్రీవెన్స్ లో వచ్చే సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్లు తనకు సమాచారం ఉందన్నారు .ఇంతకు ముందు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించాల్సి వచ్చేదని ఇప్పుడు ప్రజలకు ఆ బాధ తప్పిందన్నారు .

క్యాష్ లెస్ తెలంగాణ లక్ష్యం దిశగా …

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని క్యాష్ లెస్ దిశగా ప్రజలను అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు . భవిష్యత్తులోనూ కేంద్రం పూర్తి స్థాయిలో నోట్లు ప్రింట్ చేసే పరిస్థితి కనిపించడంలేదని ఇప్పుడు ప్రజలకు క్యాష్ లెస్ దిశగా అవగాహన కల్పించడం మినహా మరో మార్గం లేదని ముఖ్యమంత్రి వివరించారు . మొబైల్ యాప్స్ , డెబిట్ కార్డ్స్ , చెక్స్ , నెట్ బ్యాంకింగ్ వంటి అన్ని రకాల పద్ధతుల్లో ప్రజలు బ్యాంకు లావాదేవీలు నిర్వహించుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగపర్చుకోవాలని సూచించారు . మొదట క్యాష్ లెస్ నియోజకవర్గంగా అడుగులు వేసిన సిద్ధిపేట అనుభవాలను అన్ని జిల్లాల కలెక్టర్లు ఉపయోగించుకోవాలని ఆదేశించారు .

సంక్షేమానికి 30 వేల కోట్లు…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకునే సంకల్పంతో బడ్జెట్ లో 30 వేల కోట్ల పైచిలుకు కేటాయిస్తున్నదని , వాటిని పూర్తిగా పేదలకు అందే విషయంలో కలెక్టర్లు క్లోజ్ మానిటరింగ్ చేయాలని సి.ఎం  సూచించారు . గతంలో ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక  రాజకీయ కోణంలో జరిగేదని తమ ప్రభుత్వం ఆ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించాలని నిర్ణయించిందని వివరించారు . ఎస్ సి , ఎస్ టి , బీసీ , మైనార్టీలకు అన్ని సౌకర్యాలతో ఉచిత విద్య అందించే ఉద్దేశంతో గురుకుల పాఠశాలలను నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రారంభిస్తున్నామని దశల వారీగా పేదలందరికీ పూర్తి స్థాయి రెసిడెన్షియల్ విద్య ను అందించాలనే ప్రణాళిక ప్రభుత్వానికి ఉందన్నారు . ఈ గురుకుల విద్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వసతులను పరిశీలించాలని సూచించారు .

ఉద్యమ రూపంగా మిషన్ కాకతీయ…

కాకతీయ రాజుల హయాంలో తెలంగాణలో చిన్న నీటి వనరుల వ్యవస్థను నెలకొల్పడంతో వేలాది చెరువులు ఇక్కడి రైతాంగానికి వరంగా లభించాయని , ప్రభుత్వం రాగానే వాటిని పునరుద్ధరించేందుకు నిర్ణయించి మిషన్ కాకతీయ కింద ప్రతి ఏటా 8500 పైచిలుకు చెరువులను పునర్నిర్మించే ప్రక్రియ చేపట్టినట్లు సి ఎం కెసిఆర్ వివరించారు . ప్రారంభంలో చెరువు మట్టి ఎవరు తీసుకొని పోతరు అని అన్నరని కానీ తర్వాత మిషన్ కాకతీయ ఉద్యమ రూపం తీసుకుందని వివరించారు . కొన్ని కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని రైతులు తమ స్వంత ఖర్చుతో తమ పంట భూములకు తరలించుకున్నారని తెలిపారు . ఇది లాంగ్ లాస్టింగ్ ప్రోగ్రాం అని దీన్ని నిరంతరం కొనసాగిస్తామని చెప్పారు . చెరువుల నిర్మాణం చేపట్టని చోట వాటిని చేపట్టాలని , చెరువుల నిర్మాణం పూర్తయిన చోట వాటికి ఫీడర్ ఛానల్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు .

మరిన్ని అంశాలు వివరంగా …

‘‘అనేక భిన్న దృక్పథాలు కలిగిన పార్టీలు అధికారంలోకి వచ్చాయి.  అనేక కార్యక్రమాలు చేపట్టాయి. అయినా సమాజంలో ఎక్కడో ఏదో అసంతృప్తి ఉన్నట్లు వుంది.   లోపం ఎక్కడుందో గుర్తించాలి.   ప్రజలకు నిజంగా ఏమి కావాలో తెలుసుకోవాలి.  పరిష్కారాలు వెతకాలి.  ప్రజల అసంతృప్తి పరిధి దాటితే కొన్ని శక్తులు దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం వుంది.  ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం సృజనాత్మకంగా ఆలోచించాలి. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పురావాలి.   సమాజంలో నెలకొన్న అపసవ్య పరిస్థితులను అరికట్టడం అనుకుంటే అసాధ్యం కాదు.  ప్రభుత్వం అంటే కేవలం మంజూరీలు  ఇవ్వడం కోసం మాత్రమే అనే అభిప్రాయం వుంది.   కేవలం డబ్బులతోనే అన్ని పనులు కావు.  మంచి పాలసీలు, పథకాలు రావాలి.   అవి ప్రజల జీవితాల్లో మార్పురావాలి.  టిఎస్ ఐపాస్ చట్టం తేవడం వల్ల పారిశ్రామిక విధానం అద్భుతంగా వచ్చింది.   2500 పరిశ్రమలు వచ్చాయి.   మిషన్  కాకతీయ ద్వారా చెరువులు గొప్పగా పునరుద్ధరించుకొంటున్నాం.  హరితహారం ద్వారా గ్రీన్ కవర్ పెంచుకుంటున్నాం. పేకాటను అరికట్టగలిగాం.  గుడంబాను నిర్మూలించగలుగుతున్నాం.  గుడంబా తయారీ మానేసిన మహిళలకు ఉపాధి చూపించాలి.   సంక్షేమ రంగంలో నెంబర్ వన్ గా నిలిచాం.  30 వేల కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నాం.  కుటుంబాలను విచ్ఛిన్నం చేసే దురాచారాలను రూపుమాపడంలో మనం విజయవంతమయ్యాం.   ఇంకా అనేక  కార్యక్రమాలు చేస్తున్నాం.  ఇదే స్పూర్తితో ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకు సాగాలి’’  అని సిఎం చెప్పారు. ‘‘పరిపాలనా  సమర్ధవంతంగా సాగడానికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. మూడు నాలుగు లక్షల కుటుంబాలకు ఓ జిల్లా వుంది.   కలెక్టర్లు, ఎస్పీల దగ్గర అన్ని వివరాలు ఉండాలి.   పాలన మరింత బాగా సాగాలి.   మూస పద్ధతి విడనాడాలి.   ప్రతీ జిల్లాలో ఒకే పధ్దతి అవసరం లేదు.   జిల్లాల స్వరూపం, స్వభావం, నైసర్గిక పరిస్థితులు, వాతావరణం, వనరుల ఆధారంగా జిల్లా ప్రణాళిక సిధ్దం చేయాలి.   నో యువర్ డిస్ట్రిక్ట్ – ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్. ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రణాళిక వుండాలి. స్థానిక వనరులను గుర్తించి, వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. అర్బన్, రూరల్, వ్వవసాయ, పారిశ్రామిక గనుల పరంగా జిల్లాల వారీగా ప్రాధాన్యాలు మారతాయి. దాన్ని బట్టి ప్లాన్ వేయాలి. ఇలా ప్రతీ జిల్లాలో జరగాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు. ‘‘మిషన్ కాకతీయ బాగా జరుగుతోంది. మంచి వర్షాల వల్ల జలకళ ఉట్టి పడుతోంది. చెరువుల్లో చేపల పంపకాన్ని ప్రోత్సహించాలి. మిషన్ భగీరథ పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ఎస్సీ, ఎస్టీ, బిసి తదితర పేదల కోసం అమలు చేసే కార్యక్రమాలను నిశితంగా పర్యవేక్షించాలి. గతంలో అసైన్ చేసిన భూములు ఏ స్థితిలో ఉన్నాయో చూడాలి. అవి ఉపయోగంలోకి వచ్చే కార్యాచరణ రూపొందించాలి. జాతీయ రహదారులు పెద్ద ఎత్తున ముంజూరయ్యాయి. వాటి నిర్మాణానికి అవసరమైన సహకారం అందించాలి. భూసేకరణ జరపాలి. ప్రాజెక్టులకు అవసరమైన భూమి సేకరించాలి’’ అని సిఎం కేసిఆర్ దిశా నిర్దేశం చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డీ మానిటైజేషన్ ప్రభావం అన్ని రాష్ట్రాల మాదిరిగానే మన పైనా వుంది. క్యాష్ లెస్ లావాదేవీల వైపు మనం పోవాల్సిందే. సిద్దిపేటలో నగదు రహిత లావాదేవీల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రమంతా ఇలాగే జరగాలి. బ్యాంకు లావాదేవీలు ఆన్ లైన్ వినియోగం, మోబైల్ యాప్ ల వినియోగం పెరగాలి. అన్నివర్గాలకు అవగాహన కల్పించాలి. ప్రజలను చైతన్య పరచాలి. బ్యాంకులు కూడా స్వైప్ మిషన్లు అందుబాటులోకి తేవాల్సి వుంది. సర్వర్ల సామార్ధ్యం పెంచాల్సి వుంది. నేను బ్యాంకర్లతో మాట్లాడుతున్నాను. మీరు కూడా బ్యాంకర్లతో సమావేశాలు పెట్టుకుని అవసరమైన నేపథ్యం ఏర్పాటు చేయాలి. అంతిమంగా తెలంగాణను క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ స్టేట్ గా మార్చాలి. కలెక్టర్లు పోటీ పడి ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి. విద్యార్థులు, లాయర్లు, డాక్టర్లు, టీచర్లు, ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి. ‘‘జిల్లాల పరిధి తగ్గింది. కాబట్టి పర్యవేక్షణ పెరగాలి. ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి మెరుగు పడాలి. ప్రతీ బెడ్ కు రూ. 5 వేలకు పైగా నెలనెలా నిర్వహణ ఖర్చు ఇస్తున్నాం. బెడ్ షీట్స్, బెడ్స్ మారుస్తున్నాం. మందుల కొనుగోలు బడ్జెట్ రెట్టింపు చేశాం. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి మెరుగుపడాలి. కలెక్టర్లు పర్యవేక్షించాలి’’ అని సిఎం చెప్పారు.”సాదా బైనామాలను ఉచితంగానే రిజిస్టర్ చేయించాలని విధానం తెచ్చాం. హైదరాబాద్ జిహెచ్ఏండిఏ,  వరంగల్ కుడా (KUDA) పరిధిలోని వ్యవసాయ భూముల సాదా బైనామాలను ఆమోదించడానికి అనుమతి ఇస్తున్నాం” అని సిఎం ప్రకటించారు. “గ్రామాల్లో స్మశాన వాటికలు నిర్మించాలి. ముస్లింలు, క్రిస్టియన్లు ఎక్కువగా ఉండే చోట ఖనన వాటికలు (బరేల్ గ్రౌండ్స్) నిర్మించాలి. నరేగా నిధులతో ఈ పనులు చేయవచ్చు. స్మశాన వాటికలు నిర్మించడం పుణ్యకార్యం. దాతల నుండి విరాళాలు సేకరించండి. సిఎస్ఆర్ పథకం వినియోగించుకోవాలి. ఎన్ఆర్ఐ లు పారిశ్రామిక వేత్తలను అడగాలి, వారి సహకారం తీసుకోవాలి. స్మశాన వాటికల నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా తీసుకోవాలి. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు బాగా జరగాలి. ప్రతి గ్రామంలో, పట్టణంలో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలి” అని సీఎం సూచించారు. “ప్రతి జిల్లా కలెక్టర్ వద్ద రూ.3 కోట్ల నిధులు పెడతాం. అత్యవసరమైన వారి దృష్టికి వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరించడానికి ఈ నిధులు ఖర్చు చేసే విచక్షణాధికారం ఇస్తున్నాం. ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీల ఫండ్ ను, ఎంపిల సీడిఎఫ్ ను కూడా ఉపయోగించుకోవాలి. హాస్టళ్ళు, ఆసుపత్రుల కనీస వసతులపై దృష్టి పెట్టాలి”   అని సీఎం అన్నారు. ‘‘తెలంగాణకు హరితహారం చాల ముఖ్యమైన కార్యక్రమం. గ్రీన్ కవర్  పెంచాలి సహజంగా పెరిగిన అడవులను నరకడం వల్ల వాతావరణ అసమతౌల్యం ఏర్పడింది. కాబట్టి 33% అడవులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అటవీ శాఖాధికారులతో సమన్వయం ఏర్పాటు చేసుకోవాలి. నర్సరీల పరిస్థితి సమిక్షించాలి. నర్సరీలు సందర్శించాలి. పెట్టిన మొక్కలు ఎండిపోకుండా నీళ్లు పోయాలి. నేషనల్ హైవేస్ పై విధిగా మొక్కలు పెంచేలా వర్కింగ్ ఎజేన్సీలతో మాట్లాడాలి. మొక్కల పెంపకానికి నరేగా నిధులు వాడాలి. సామాజిక వనాలు పెంచడంతో పాటు అటవీ భూముల్లో అడవి పునరుద్ధరణ కోసం చర్యలు తీసుకోవాలి’’ అని సీఎం  చెప్పారు. “గ్రీవెన్స్ డే మొక్కుబడిగా సాగవద్దు. వినతుల పరిష్కారం కావలి దీనిపై దృష్టి పెట్టాలి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం వేగంగా జరిగేలా చూడాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చాల మెరుగైంది. షి టీమ్స్ బాగా పనిచేస్తున్నాయి. ఆర్టీసి బస్సుల్లో కూడా తగిన ఏర్పాట్లు చేశాం. జిల్లాల్లో కూడా   షి టీమ్స్  ఏర్పాటు చేసి ఈవ్ టీజింగ్ అరికట్టాలి”  అని కేసిఆర్ సూచించారు. “కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు ఒక టీమ్ గా పని చేస్తే మంచి పలితాలు వస్తాయి. సమైక్యంగా పని చేసి ప్రజలకు మేలైన సేవలందిచప్రకటన-01-14th డిసెంబర్, 2016 అభివృద్ధి, సంక్షేమపథకాలు మరింత సమర్థవంతంగా అమలు కావాలనే ఉద్దేశ్యంలోనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని, పరిపాలనా విభాగాలు వికేంద్రీకరించుకున్నామని, వాటి ఫలితాలు ప్రజలకు అందాలంటే అధికార యంత్రాంగం మరింత క్రియాశీలకంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలపునిచ్చారు.  ప్రగతి భవన్ లో బుధవారం కలెక్టర్ల సదస్సు జరిగింది.   సిఎం కేసిఆర్ ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడారు.  డిప్యూటి సిఎంలు, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు పాల్గొన్నారు.
‘‘అనేక భిన్న దృక్పథాలు కలిగిన పార్టీలు అధికారంలోకి వచ్చాయి.  అనేక కార్యక్రమాలు చేపట్టాయి. అయినా సమాజంలో ఎక్కడో ఏదో అసంతృప్తి ఉన్నట్లు వుంది.   లోపం ఎక్కడుందో గుర్తించాలి.   ప్రజలకు నిజంగా ఏమి కావాలో తెలుసుకోవాలి.  పరిష్కారాలు వెతకాలి.  ప్రజల అసంతృప్తి పరిధి దాటితే కొన్ని శక్తులు దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం వుంది.  ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం సృజనాత్మకంగా ఆలోచించాలి. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పురావాలి.   సమాజంలో నెలకొన్న అపసవ్య పరిస్థితులను అరికట్టడం అనుకుంటే అసాధ్యం కాదు.  ప్రభుత్వం అంటే కేవలం మంజూరీలు  ఇవ్వడం కోసం మాత్రమే అనే అభిప్రాయం వుంది.   కేవలం డబ్బులతోనే అన్ని పనులు కావు.  మంచి పాలసీలు, పథకాలు రావాలి.   అవి ప్రజల జీవితాల్లో మార్పురావాలి.  టిఎస్ ఐపాస్ చట్టం తేవడం వల్ల పారిశ్రామిక విధానం అద్భుతంగా వచ్చింది.   2500 పరిశ్రమలు వచ్చాయి.   మిషన్  కాకతీయ ద్వారా చెరువులు గొప్పగా పునరుద్ధరించుకొంటున్నాం.  హరితహారం ద్వారా గ్రీన్ కవర్ పెంచుకుంటున్నాం. పేకాటను అరికట్టగలిగాం.  గుడంబాను నిర్మూలించగలుగుతున్నాం.  గుడంబా తయారీ మానేసిన మహిళలకు ఉపాధి చూపించాలి.   సంక్షేమ రంగంలో నెంబర్ వన్ గా నిలిచాం.  30 వేల కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నాం.  కుటుంబాలను విచ్ఛిన్నం చేసే దురాచారాలను రూపుమాపడంలో మనం విజయవంతమయ్యాం.   ఇంకా అనేక  కార్యక్రమాలు చేస్తున్నాం.  ఇదే స్పూర్తితో ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకు సాగాలి’’  అని సిఎం చెప్పారు.
‘‘పరిపాలనా  సమర్ధవంతంగా సాగడానికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. మూడు నాలుగు లక్షల కుటుంబాలకు ఓ జిల్లా వుంది.   కలెక్టర్లు, ఎస్పీల దగ్గర అన్ని వివరాలు ఉండాలి.   పాలన మరింత బాగా సాగాలి.   మూస పద్ధతి విడనాడాలి.   ప్రతీ జిల్లాలో ఒకే పధ్దతి అవసరం లేదు.   జిల్లాల స్వరూపం, స్వభావం, నైసర్గిక పరిస్థితులు, వాతావరణం, వనరుల ఆధారంగా జిల్లా ప్రణాళిక సిధ్దం చేయాలి.   నో యువర్ డిస్ట్రిక్ట్ – ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్. ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రణాళిక వుండాలి. స్థానిక వనరులను గుర్తించి, వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. అర్బన్, రూరల్, వ్వవసాయ, పారిశ్రామిక గనుల పరంగా జిల్లాల వారీగా ప్రాధాన్యాలు మారతాయి. దాన్ని బట్టి ప్లాన్ వేయాలి. ఇలా ప్రతీ జిల్లాలో జరగాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.
‘‘మిషన్ కాకతీయ బాగా జరుగుతోంది. మంచి వర్షాల వల్ల జలకళ ఉట్టి పడుతోంది. చెరువుల్లో చేపల పంపకాన్ని ప్రోత్సహించాలి. మిషన్ భగీరథ పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ఎస్సీ, ఎస్టీ, బిసి తదితర పేదల కోసం అమలు చేసే కార్యక్రమాలను నిశితంగా పర్యవేక్షించాలి. గతంలో అసైన్ చేసిన భూములు ఏ స్థితిలో ఉన్నాయో చూడాలి. అవి ఉపయోగంలోకి వచ్చే కార్యాచరణ రూపొందించాలి. జాతీయ రహదారులు పెద్ద ఎత్తున ముంజూరయ్యాయి. వాటి నిర్మాణానికి అవసరమైన సహకారం అందించాలి. భూసేకరణ జరపాలి. ప్రాజెక్టులకు అవసరమైన భూమి సేకరించాలి’’ అని సిఎం కేసిఆర్ దిశా నిర్దేశం చేశారు.
‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డీ మానిటైజేషన్ ప్రభావం అన్ని రాష్ట్రాల మాదిరిగానే మన పైనా వుంది. క్యాష్ లెస్ లావాదేవీల వైపు మనం పోవాల్సిందే. సిద్దిపేటలో నగదు రహిత లావాదేవీల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రమంతా ఇలాగే జరగాలి. బ్యాంకు లావాదేవీలు ఆన్ లైన్ వినియోగం, మోబైల్ యాప్ ల వినియోగం పెరగాలి. అన్నివర్గాలకు అవగాహన కల్పించాలి. ప్రజలను చైతన్య పరచాలి. బ్యాంకులు కూడా స్వైప్ మిషన్లు అందుబాటులోకి తేవాల్సి వుంది. సర్వర్ల సామార్ధ్యం పెంచాల్సి వుంది. నేను బ్యాంకర్లతో మాట్లాడుతున్నాను. మీరు కూడా బ్యాంకర్లతో సమావేశాలు పెట్టుకుని అవసరమైన నేపథ్యం ఏర్పాటు చేయాలి. అంతిమంగా తెలంగాణను క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ స్టేట్ గా మార్చాలి. కలెక్టర్లు పోటీ పడి ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి. విద్యార్థులు, లాయర్లు, డాక్టర్లు, టీచర్లు, ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి.
‘‘జిల్లాల పరిధి తగ్గింది. కాబట్టి పర్యవేక్షణ పెరగాలి. ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి మెరుగు పడాలి. ప్రతీ బెడ్ కు రూ. 5 వేలకు పైగా నెలనెలా నిర్వహణ ఖర్చు ఇస్తున్నాం. బెడ్ షీట్స్, బెడ్స్ మారుస్తున్నాం. మందుల కొనుగోలు బడ్జెట్ రెట్టింపు చేశాం. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి మెరుగుపడాలి. కలెక్టర్లు పర్యవేక్షించాలి’’ అని సిఎం చెప్పారు.
“సాదా బైనామాలను ఉచితంగానే రిజిస్టర్ చేయించాలని విధానం తెచ్చాం. హైదరాబాద్ జిహెచ్ఏండిఏ,  వరంగల్ కుడా (KUDA) పరిధిలోని వ్యవసాయ భూముల సాదా బైనామాలను ఆమోదించడానికి అనుమతి ఇస్తున్నాం” అని సిఎం ప్రకటించారు. “గ్రామాల్లో స్మశాన వాటికలు నిర్మించాలి. ముస్లింలు, క్రిస్టియన్లు ఎక్కువగా ఉండే చోట ఖనన వాటికలు (బరేల్ గ్రౌండ్స్) నిర్మించాలి. నరేగా నిధులతో ఈ పనులు చేయవచ్చు. స్మశాన వాటికలు నిర్మించడం పుణ్యకార్యం. దాతల నుండి విరాళాలు సేకరించండి. సిఎస్ఆర్ పథకం వినియోగించుకోవాలి. ఎన్ఆర్ఐ లు పారిశ్రామిక వేత్తలను అడగాలి, వారి సహకారం తీసుకోవాలి. స్మశాన వాటికల నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా తీసుకోవాలి. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు బాగా జరగాలి. ప్రతి గ్రామంలో, పట్టణంలో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలి” అని సీఎం సూచించారు.
“ప్రతి జిల్లా కలెక్టర్ వద్ద రూ.3 కోట్ల నిధులు పెడతాం. అత్యవసరమైన వారి దృష్టికి వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరించడానికి ఈ నిధులు ఖర్చు చేసే విచక్షణాధికారం ఇస్తున్నాం. ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీల ఫండ్ ను, ఎంపిల సీడిఎఫ్ ను కూడా ఉపయోగించుకోవాలి. హాస్టళ్ళు, ఆసుపత్రుల కనీస వసతులపై దృష్టి పెట్టాలి”   అని సీఎం అన్నారు.
‘‘తెలంగాణకు హరితహారం చాల ముఖ్యమైన కార్యక్రమం. గ్రీన్ కవర్  పెంచాలి సహజంగా పెరిగిన అడవులను నరకడం వల్ల వాతావరణ అసమతౌల్యం ఏర్పడింది. కాబట్టి 33% అడవులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అటవీ శాఖాధికారులతో సమన్వయం ఏర్పాటు చేసుకోవాలి. నర్సరీల పరిస్థితి సమిక్షించాలి. నర్సరీలు సందర్శించాలి. పెట్టిన మొక్కలు ఎండిపోకుండా నీళ్లు పోయాలి. నేషనల్ హైవేస్ పై విధిగా మొక్కలు పెంచేలా వర్కింగ్ ఎజేన్సీలతో మాట్లాడాలి. మొక్కల పెంపకానికి నరేగా నిధులు వాడాలి. సామాజిక వనాలు పెంచడంతో పాటు అటవీ భూముల్లో అడవి పునరుద్ధరణ కోసం చర్యలు తీసుకోవాలి’’ అని సీఎం  చెప్పారు.
“గ్రీవెన్స్ డే మొక్కుబడిగా సాగవద్దు. వినతుల పరిష్కారం కావలి దీనిపై దృష్టి పెట్టాలి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం వేగంగా జరిగేలా చూడాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చాల మెరుగైంది. షి టీమ్స్ బాగా పనిచేస్తున్నాయి. ఆర్టీసి బస్సుల్లో కూడా తగిన ఏర్పాట్లు చేశాం. జిల్లాల్లో కూడా   షి టీమ్స్  ఏర్పాటు చేసి ఈవ్ టీజింగ్ అరికట్టాలి”  అని కేసిఆర్ సూచించారు.
“కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు ఒక టీమ్ గా పని చేస్తే మంచి పలితాలు వస్తాయి. సమైక్యంగా పని చేసి ప్రజలకు మేలైన సేవలందిచాలి” అని సీఎం  చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.