
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టుల కష్టాలు తీరనున్నాయి. ఇన్నాళ్లు ఊరించిన జర్నలిస్టులకు హెల్త్ కార్డుల సమస్య తీరిపోయింది. వర్కింగ్, విశ్రాంత జర్నలిస్టులకు హెల్త్ కార్డులు జారీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలుజారీ చేశారు.
వర్కింగ్ జర్నలిస్టులకు, విశ్రాంత జర్నలిస్టులకు హెల్త్ కార్డుల దస్త్రంపై సీఎం కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు త్వరగా అందజేయాలని సాంస్కృతిక సలహాదారు రమణాచారి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు సీఎం ఆదేశించారు..
కాగా సీఎం జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇస్తూ నిర్ణయం తీసుకోవడంపై జర్నలిస్టు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఐజేయూ జనరల్ సెక్రటరీ దేవులపల్లి అమర్, ఐజేయూ మాజీ నాయకులు కే.శ్రీనివాసరెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, సీనియర్ నాయకులు అయిలు రమేశ్, తాడూరి కరణాకర్, నరేందర్ రెడ్డి, గాండ్ల శ్రీనివాస్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.