తెలంగాణ చీకట్లను చీల్చిన సూర్యుడు..

సమైక్య ఆంధ్రప్రదేశ్.. ఎండ కాలం వచ్చిందంటే చాలు..వీటికి గిరాకీ పెరిగేది.. రాత్రిళ్లు ఉపయోగించే లాంతర్లు, దీపాలు.. చార్జింగ్ లైట్లు, చార్జింగ్ ఫ్యాన్లు, జనరేటర్లు, డీజిల్ ఇంజిన్లు.. ఒక్కటేమిటీ అన్ని వర్గాల వ్యాపారులు తెలుగు రాష్ట్రంలో ఎండకాలంలో వాటన్నింటి అమ్మి సొమ్ము చేసుకునేవారు.. రాష్ట్రం విడిపోక ముందుకు దాదాపు 15 సంవత్సరాల వరకు తెలంగాణ ఏపీ ఎండాకాలంలో కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతూనే ఉండేది.. చివర్లో ఉన్న సీఎం కిరణ్ హయాంలో కూడా విపరీతమైన కోతలు.. పరిశ్రమలు నష్టపోయాయి. చేతపనివారు, జిరాక్స్ లు ఇలా సకల వ్యాపారాలు కరెంటు లేక పని జరిగేదికాదు.

కానీ ఇప్పుడు తెలంగాణలో పల్లెలు, పట్నాలు తేడాలేకుండా 24 గంటల కరెంటు సరఫరా అవుతోంది. మాజీ సీఎం కిరణ్ తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఓ మాట అన్నారు.. తెలంగాణ విడిపోతే తెలంగాణ తీవ్ర విద్యుత్ సంక్షోభంలో పడిపోతుందని.. కానీ ఇప్పుడు పరిస్థితి ఎంతో మెరుగైంది.

సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్ష, పట్టుదల, తెలంగాణ చీకట్లను పారదోలింది. చీకట్లో కమ్మిన తెలంగాణకు వెలుగులు అందించింది కేసీఆర్ సూరీడే.. బలమైన కాంక్ష.. రాష్ట్రం తెచ్చిన పట్టుదల ముందు ఈ కరెంటు కోతలు ఓడిపోయాయి. సమైక్య రాష్ట్రంలో ప్రస్తుత ఏపీలో సాధ్యం కాని కరెంటు సమస్యను గద్దెనెక్కిన 10 నెలల్లోనే కేసీఆర్ పరిష్కరించి తెలంగాణ ప్రజల దృష్టి , జాతీయ మీడియా, కేంద్రంలో కేసీఆర్ హీరో అయ్యారు.

the econimic times copy

కాగా గడిచిన 15 ఏళ్లో ఎండాకాలంలో పరిశ్రమలకు హాలిడే ప్రకటించిన చరిత్ర ఏపీలో ఉండేది. కానీ తెలంగాణలో ఈ మండుటెండల్లో సైతం పరిశ్రమలకు 24 గంటలు కరెంటు సరఫరా చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని జాతీయ మీడియా ఆకాశానికెత్తింది. ది ఎకనామిక్స్ టైం పత్రిక తెలంగాణలోని పరిశ్రమలకు 24 గంటల కరెంటు సరఫరా చేస్తూ విజయం సాధించారని ప్రభుత్వ పనితీరును ప్రశంసించడం విశేషం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *