Breaking News

తెలంగాణ గోస టీఆర్ఎస్ కే తెలుసు

kcr

హైదరాబాద్, ప్రతినిధి : తరతరాలుగా దగా పడ్డ తెలంగాణ ప్రజల గోస టీఆర్ఎస్ పార్టీకే తెలుసు అని సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం హైదరాబాద్ కొంపల్లిలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రతిపక్షాల కాళ్ల కింద భూమి కదులుతోందని.. ఇక ప్రతిపక్షాలకు తెలంగాణలో చోటు లేదనే వాస్తవం వారు గ్రహించే విమర్శలకు దిగుతున్నారని కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు సరిగ్గా అమలైతే తెలంగాణలో మరో పార్టీ గెలిచే అవకాశం లేదన్నారు. అందుకే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. ఆకలి చావులు లేని తెలంగాణ టీఆర్ఎస్ స్వప్నం అని కేసీఆర్ అన్నారు.

మనముందు మూడు లక్ష్యాలున్నాయని ఒకటి పారిశ్రామిక విధానం అని.. దాని వల్ల మనబిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని.. అభివృద్ది జరిగి మన చేతినిండా డబ్బులు ఉంటాయన్నారు.
రెండోది వ్యవసాయం అని మన రైతుల పొలాలు పండాలి. చెర్లల్ల నీళ్లు రావాలి.. ఏ రైతు తెలంగాణలో ఆత్మహత్య చేసుకోకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలని సూచించారు.

మూడోది సంక్షేమ ఫలాలు.. అర్హులందరికీ రేషన్, పక్కాఇళ్లు, పించన్లు, మిషన్ కాకతీయలాంటి అన్ని పథకాలు ప్రజలకు చేరువ కావాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ లో 150 సీట్లు పెరుగుతున్నాయని.. అందులో 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ 130 సీట్లు ఖచ్చితంగా వస్తాయని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే టీఆర్ఎస్ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇస్తానని కేసీఆర్ చెప్పారు. మీరందరూ టీఆర్ఎస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *