Breaking News

తెలంగాణ గజ.. గజ

03cold5

ఈశాన్య రుతుపవనాల తిరోగమనంతో దేశంలోకి ఉత్తరాన గల సైబీరియానుంచి శీతల గాలులు ప్రవేశించాయి. దీంతో తెలంగాణతో సహా భారతదేశమంతా చలితో వణికిపోతోంది.. శీతల గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. ఈ నెలలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నిన్న 7.7 డిగ్రీల కనిష్టంగా నమోదయ్యాయి.. మరో పదిరోజుల పాటు ఇదే పరిస్థితి ఓ పదిరోజుల పాటు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు..

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణంగా కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. నిజామాబాద్, రామగుండంలో కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలకు తగ్గింది.. హైదరాబాద్ నగరంలో తేమ సాధారణం కన్నా 22 శాతం తక్కువగా ఉంది. తేమ తగ్గడంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.. పగటి పూట మాత్రం సాధారణం కన్నా ఎండ వేడి కాస్త ఎక్కువగా ఉంటోంది. పొరుగు రాష్ట్రం ఏపీలో కూడా శీతల గాలుల ప్రభావం ఎక్కువగా ఉంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *