తెలంగాణ – కేరళ హెరిటేజ్ ఫేస్ట్ బ్రోచర్ ను విడుదల చేసిన మంత్రి చందూలాల్

తెలంగాణ , కేరళ రాష్ట్రాల హెరిటేజ్ ఫేస్టువల్ బ్రోచర్ ను పర్యాటక, సంస్కృతిక శాఖల మంత్రి ఆజ్మీరా చందూలాల్ , పర్యాటక, కల్చరల్ శాఖల కార్యదర్శి బుర్ర వేంకటేశం , కల్చరల్ శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కేరళ రాష్ట్ర కల్చరల్ డైరేక్టర్ బెంజీమేన్ లు ఆవిష్కరించారు. కేరళ రాష్ట్ర టూరిజం. కల్చరల్ , ఆర్కయాలజీ, సినిమా రంగాల కళాకారులు తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 25 నుండి 27 వరకు లలిత కళాతోరణంలో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు టూరిజం , కల్చరల్ శాఖల కార్యదర్శి బుర్ర వేంకటేశం ప్రకటించారు. కేరళ ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం ఇదే మెుదటిసారి ఆన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గోనటానికి తెలంగాణ, కేరళ రాష్ట్రాల హేరిటేజ్ ఫేస్టువల్ లో పాల్గోనటానికి ఇద్దరు కేరళ మంత్రులు పాల్గోనబోతున్నట్లు టూరిజం కార్యదర్శి బుర్ర వేంకటేశం వేల్లడించారు. ఈ ఫేస్టువల్ ద్వారా కేరళ , తెలంగాణ రాష్ట్రాల మద్య సత్ సంబందాలు ఏర్పడుతాయన్నారు. తెలంగాణ టూరిజం ఇప్పటికే కేరళ రాష్ట్రంలో టూరిజం రోడ్ షో లను నిర్వహించామన్నారు . ఈ రోడ్ షో లో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించటానికి కేరళ ప్రజలు ఎంతో ఆసక్తి గా ఉన్నారన్నారు టూరిజం కార్యదర్శి బుర్ర వేంకటేశం .

తెలంగాణ , కేరళ హేరిటేజ్ ఫెస్టివల్ లో పలు సాంస్కృతిక కార్యక్రమాల తోపాటు క్వీజ్ పోటిలు, పుడ్ ఫేస్టువల్ నిర్వహిస్తున్నట్లు టూరిజం కార్యదర్శి బుర్ర వేంకటేశం తెలిపారు. ఈ హెరిటేజ్ ఫెస్టువల్ లో పాల్గోనటానికి రాష్ట్రంలో ఉన్న కేరళ ప్రజలు మరియు తెలంగాణ ప్రజలు పెద్ద ఏత్తున పాల్గోనాలని కోరారు. ఈ లాంటి ఫెస్టువల్ ను రాష్ట్రంలో ఇప్పటికే జమ్ము కాశ్మీర్ కల్చరల్ ఫేస్టువల్ ను నిర్వహించామని, ఇప్పుడు కేరళ హేరిటేజ్ ఫేస్టువల్ ను నిర్వహించటం ద్వారా హైదరాబాద్ నగరం నిత్యం ఎదో పెస్టువల్ కు వేదిక గా నిలుస్తుందన్నారు. తెలంగాణ కల్చరల్ ట్రూప్ త్వరలో జమ్ము కాశ్మీర్ , కేరళ రాష్ట్రాలలో పర్యటించి పర్యాటక, సాంస్కృతిక బందాలను మరింత పెంపుందించుకోవటానికి కార్యక్రమాలను రూపోందిస్తున్నట్లు వేల్లడించారు. వీటితో పాటు తెలంగాణ టూరిజం ప్రమేషన్ లో భాగంగా వచ్చే నేలలో నార్త్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియా ప్రాంతాలలో రోడ్ షో లను నిర్వహిస్తామన్నారు టూరిజం కార్యదర్శి బుర్ర వేంకటేశం .

తెలంగాణ , కేరళ హెరిటేజ్ ఫేస్టువల్ నిర్వహింటం ద్వారా ఇరురాష్ట్రాల మద్య సాంస్కృతిక బందాలను ఏర్పరచడం కోసం భాషా సాంస్కృతికశాఖ మంచి కార్యాచరణ ప్రణాళికతో ముందంజ వేస్తుందన్నారు టూరిజం , సాంస్కృతిక, గిరిజన వ్వవహారాల శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ . ఇటివల తెలంగాణ లో జమ్ము కాశ్మీర్ ఫేస్టువల్ ను ఆత్యంత ఆద్భతంగా నిర్వహించామన్నారు. ఇప్పుడు తెలంగాణ లో ఉండే మలయాళీ సోదరుల కోసం కేరళ ప్రభుత్వం తో కలసి కేరళ – తెలంగాణ హేరిటేజ్ ఫేస్టు పేరుతో ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు వేల్లడించారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా ఆంతర్జాతీయ గుర్తింపును తీసుకవచ్చేందుకు సాంస్కృతిక, పర్యాటక శాఖలు నిరంతరం కృషి చేస్తున్నట్లు వివిరించారు. ఈ నెల 25 నుంచి జరిగే ప్రారంభ ఉత్సవాలలో ఇద్దరు కేరళ మంత్రులు పాల్గోంటారన్నారన్నారు. తెలంగాణ – కేరళ హెరిటేజ్ ఫేస్టు లాంటి ఆరుదైన ఆవకాశాన్ని హైదరాబాద్ లోని మళయాలీ సోదరులు పేద్ద ఏత్తున పాల్గోనాలన్నారు. ఈ ఉత్సవాలలో నిర్వహించే పలు రకాల క్వీజ్ పోటిలలో గేలుపోందిన విజేతలకు కేరళ రాష్ట్రాలలో మూడు రోజుల పాటు ఉచితంగా కుటుంభంతో పర్యటించేందుకు బహుమతులను ఆందజేస్తామని కేరళ హెరిటేజ్ పెస్టువల్ ఆదికారి బెంజ్ మేన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పాల్గోన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *